ETV Bharat / city

వరంగల్​లో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు

author img

By

Published : Jun 4, 2020, 11:04 PM IST

తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే వ్యక్తిని వరంగల్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.30 లక్షల విలువ చేసే బంగారం, 3 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Inter-state robber arrested in Warangal
వరంగల్​లో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు

తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగను వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందుతుడి నుంచి రూ. 30 లక్షల విలువ గల 475 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి ఆభరణాలు, 2 లక్షల 50 వేల నగదు, 5 ఎల్ఈడీ టీవీలు, 6 కెమెరాలు, 2 చరవాణిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏపీ ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన సయ్యద్.. జల్సాలకు అలవాటు పడి బాల్యం నుంచే చోరీలకు పాల్పడేవాడని.. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేసేవాడని సీపీ రవీందర్​ తెలిపారు. 2003లో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చోరీలకు పాల్పడగా నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్​కు తరలించారని చెప్పారు. జైల్ నుంచి బయటకు వచ్చాక వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడని వెల్లడించారు. 2018లో ఒక్క వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 దొంగతనాలు చేశాడని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో పెరిగిపోయిన రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.