ETV Bharat / city

రాష్ట్రంలో ఏటా పాము కాటుకు ఎంత మంది బలవుతున్నారో తెలుసా..!

author img

By

Published : Aug 18, 2021, 9:25 AM IST

రాష్ట్రంలో ఏటా వేల మంది పాముకు కాటు గురవుతున్నారు. ప్రతి ఏడాదీ జూన్‌ నుంచి అక్టోబరు మధ్య సమస్య తీవ్రంగా ఉంటోంది. దేశంలో పాము కాటు గురవుతున్నారు.

snake bite
పాము కాటు

రాష్ట్రంలో ఏటా 26 వేల మంది పాము కాట్లకు గురవుతున్నారు. పల్లె జనం పొలం, ఇతర పనులకు వెళ్లిన సమయంలో ఎక్కువగా బాధితులవుతున్నారు. వర్షాకాలంలో చెట్లు, పొదల్లో... గుంతలు, ఇతరచోట్ల పాములు బయటకు వస్తూ ఆ సమీపంలో ఉండేవారిని కరుస్తున్నాయి. ప్రతి ఏడాదీ జూన్‌ నుంచి అక్టోబరు మధ్య సమస్య తీవ్రంగా ఉంటోంది.

50 రకాల పాములు ప్రాణాంతకమైనవి

...

పాముల్లో వేల రకాలు ఉన్నప్పటికీ... అన్నీ విషపూరితమైనవి కావు. 50 రకాలనే ప్రాణాంతకమైనవిగా గుర్తించారు. ముఖ్యంగా ఎక్కువగా తారసపడే వాటిలో తాచు(నాగు) పాము, రక్త పింజర, కట్లపాము విషపూరితమైనవి. సకాలంలో చికిత్స అందకుంటే బాధితులు కోమాలోకి వెళ్లడం/చనిపోయే ప్రమాదం ఉంది.

  • రాష్ట్రంలో 2017లో 85 మంది, 2018లో 118 మంది, 2019లో 467 మంది పాము కాటుతో మరణించారు.
  • దేశవ్యాప్తంగా 2017లో 1.58 లక్షలు, 2018లో 1.65 లక్షలు, 2019లో 1.62 లక్షల పాము కాట్లు నమోదయ్యాయి.
  • 2017లో 1,060 మంది, 2018లో 887, 2019లో 3,163 మంది చనిపోయారు.
..

విషాన్ని బట్టి చికిత్స

..
  • పాము కరిచిందన్న భయంతోనే బాధితులు తీవ్ర సమస్యల్లోకి జారిపోతున్నారు. ఆందోళన వల్ల గుండె వేగం పెరిగి, రక్తం ద్వారా విషం మరింతగా ఒళ్లంతా వ్యాపిస్తుంది.
  • పాము కరిచాక కనిపించే లక్షణాలు సాధారణంగా 4-6 గంటల మధ్య మొదలవుతాయి. కొందరిలో గంటలోపే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించొచ్చు. ఇది ఎంత విషం రక్తంలోకి ఎక్కిందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
  • పాము కరిచాక విష ప్రభావ లక్షణాలు మొదలవుతుంటే వెంటనే చికిత్స ఆరంభించాలి. రక్తపోటు పడిపోయి, శ్వాసవ్యవస్థ దెబ్బతిన్నాక అందించే చికిత్స వల్ల కోలుకునే అవకాశాలు 40% తగ్గుతాయి.
  • ఒంటి మీద పాము కరిచిన గాట్లతో పాటు నాడీ సమస్యలు గానీ, రక్తస్రావం గానీ కనిపిస్తుంటే సమయం వృథా చేయకుండా యాంటీ స్నేక్‌ వెనమ్‌ ఇంజక్షన్లతో తక్షణమే చికిత్స ఆరంభించాలి.

ఇదీ చదవండి:

3 babies born: ఒకే కాన్పులో ముగ్గురి జననం.. ఒకరి పరిస్థితి ఆందోళనకరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.