ETV Bharat / city

'జులాయి' సీన్ రిపీట్ చేశారు.. బ్యాంకునే దోచేశారు!

author img

By

Published : Jul 4, 2022, 5:30 PM IST

Bank theft: సినిమాల్లో మంచీ మర్యాదా.. నీతీ నిజాయితీ.. ఎంత మంది నేర్చుకుంటున్నారో తెలియదుగానీ.. చెడ్డ పనులను మాత్రం పొల్లు పోకుండా బుర్రలో స్టోర్ చేసుకుంటున్నారు! అంతేనా.. వాటిని రిహార్సల్ చేసి, అమల్లో పెట్టేస్తున్నారు కూడా! మొన్నీమధ్య.. గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప సినిమాలో.. స్మగ్లర్లకు బోలెడు ఐడియాలు దొరికాయి. వాటిని ఫాలో అయిన గంజాయి, డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయి కూడా! తాజాగా.. మరో ముఠా ఏకంగా బ్యాంకుకే కన్నం వేసింది. దీనికి జులాయి సినిమాను ఇన్స్పిరేషన్​గా తీసుకున్నట్టు కనిపిస్తోంది.. ఆ చోరీ తతంగం మొత్తం చూసిన తర్వాత! ఆ సీన్​ రీ-కన్సట్రక్షన్.. మీకోసం.

Bank theft
బ్యాంకులో భారీ చోరీ

Bank theft: ఈ బ్యాంకు చోరీ ఘటన జరిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో. సీన్ ఓపెన్ చేస్తే.. అది బుస్సాపూర్‌ గ్రామం. మెండోరా మండలంలో ఉంటుంది. ఈ ఊళ్లో.. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉంది. ఎప్పుడు ప్లాన్ చేశారో తెలియదు.. ఎన్ని రోజులు రెక్కీ నిర్వహించారో తెలియదు.. మొత్తానికి ప్లాన్ మాత్రం పక్కాగా అమలు చేశారు. నిన్న ఆదివారం కావడంతో బ్యాంకుకు సెలవు వచ్చింది. ఇవాళ (సోమవారం) బ్యాంకు తెరవడానికి వెళ్లిన వారికి.. విషయం తెలిసింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వారు రంగంలోకి దిగారు. లోనికి వెళ్లి చెక్ చేస్తే.. ఒక్కొక్కటిగా వివరాలన్నీ వెలుగు చూడడం మొదలు పెట్టాయి.

బ్యాంకులో భారీ చోరీ

ఈ చోరీ ఘటనలో ఎంత మేది పాల్గొన్నారు అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఎంత ఎత్తుకెళ్లారు? ఏమేం దోచుకుపోయారు? అనే లెక్క మాత్రం తేలింది. నగదుతోపాటు బంగారాన్ని కూడా దోచేశారు దుండగులు. డబ్బుల కట్టలు చారెడు.. బంగారం మాత్రం బారెడు సర్దేశారు. బ్యాంకు లాకర్లలో నుంచి రూ.7.22 లక్షల నగుదు కాజేసిన దొంగలు.. రూ.2 కోట్ల విలువైన పసిడి కొట్టేశారు. అయితే.. ఈ చోరీకి దొంగలు అనుసరించిన పద్ధతి అచ్చం జులాయి సినిమాలోని బ్యాంకు దోపిడీ సన్నివేశాలను పోలీ ఉండడం గమనార్హం.

Bank theft
బ్యాంకులో భారీ చోరీ

ముఖాలకు మంకీ క్యాప్​లు వేసుకున్న గొందలు.. గ్యాస్ కట్టర్లతో బ్యాంకు చోరీకి వచ్చారు. ముందుగా బ్యాంకు షట్టర్ ను కట్ చేసి.. లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాల వైర్లను కత్తిరించారు. అలా.. తమ చోరీని రికార్డ్ కాకుండా ఆపేశారు. ఆ తర్వాత గ్యాస్ కట్టర్లను ఉపయోగించి లాకర్లను తెరిచారు. సమయం ఎంతసేపు పట్టిందో తెలియదుగానీ.. స్కెచ్ మాత్రం అనుకున్నట్టుగా ముగించారు. డబ్బు, బంగారంతో ఉడాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, తమపని తాము చేస్తున్నారు. మరి, ఈ చోరీ కేసు.. జులాయి క్లైమాక్స్ లాగ ముగుస్తుందా? తిరిగి డబ్బు వెనక్కి వస్తుందా? లేదంటే.. చాలా చోరీల్లాగానే దీన్నీ మరిచిపోవాల్సిందేనా?? అన్నది చూడాలి.

Bank theft
బ్యాంకులో భారీ చోరీ
Bank theft
బ్యాంకులో భారీ చోరీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.