ETV Bharat / city

Petrol Prices: రూ. 10 తగ్గిస్తే ధరలు తగ్గించినట్లేనా: హోంమంత్రి సుచరిత

author img

By

Published : Nov 9, 2021, 3:49 PM IST

home minister sucharitha
home minister sucharitha

పెట్రో ధరలను తగ్గించాల్సింది కేంద్రమేనని హోంమంత్రి సుచరిత అన్నారు(home minister sucharitha on petrol prices news). ఈ విషయంలో రాష్ట్ర సర్కార్​పై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. రాష్ట్రాన్ని కాకుండా కేంద్రాన్ని ప్రశ్నిస్తే బాగుంటుందని హితవు పలికారు.

పెట్రోల్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు తగవని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు(home minister sucharitha on petrol prices news). ధరల తగ్గింపు, పెంపు కేంద్రం చేతిలో ఉందన్నారు. గుంటూరులో మాట్లాడిన మంత్రి.. 70 రూపాయలున్న పెట్రోల్ రేట్లను 118 రూపాయలకు తీసుకెళ్లారని.. ఇప్పుడు 10 రూపాయలు తగ్గిస్తే ధరలు తగ్గించినట్లేనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర పరిధిలోని లేని అంశంపై 40 ఏళ్ల అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత ప్రశ్నిస్తున్నారని.. అదేదో కేంద్రాన్ని డిమాండ్ చేయవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు.

ఈనెల 11కు గుంటూరుకు సీఎం

గుంటూరులో ఈనెల 11న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 130వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఏటా జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లపై హోంమంత్రి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే గిరిధర్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పరిశీలించారు. విద్యారంగపరంగా ఏపీని ముందుకు తీసుకుళ్తున్నామని హోంమంత్రి చెప్పారు. ఇంగ్లీష్ మీడియంతో భవిష్యత్తు విద్యారంగాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దనున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.. భాజపా నేతలకు మంత్రి కొడాలి నాని వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.