ETV Bharat / city

HIGH COURT : సినిమా టికెట్ ధరలోనే.. సర్వీసు ఛార్జీలను చేర్చటంపై హైకోర్టులో విచారణ

author img

By

Published : Apr 13, 2022, 4:41 AM IST

HC
HC

మల్టిప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరలోనే సర్వీసు ఛార్జీలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువైపు వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.

సినిమా టికెట్ ధరలోనే సర్వీసు ఛార్జీలను చేర్చడాన్ని సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఫరీద్ బిన్ అవడ్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివిఎన్ఎఎన్ సోమయాజులు ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టారు. ఇరువైపు వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మల్టిప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరల్లోనే సర్వీసు ఛార్జీలను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న జారీచేసిన జీవో 13ను సవాలు చేస్తూ మల్టిప్లెక్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. టికెట్ ధరల నిర్ణయం వ్యవహారంలో తమకు అభ్యంతరం లేదని సీనియర్ న్యాయవాది సి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. పన్నులన్నీ సక్రమంగా చెల్లిస్తున్నామన్నారు. సర్వీసు చార్జీల వ్యవహారం పూర్తిగా థియేటర్ యాజమాన్యాల వ్యవహారమన్నారు. ప్రేక్షకులకు సౌకర్యాలు అందించినందుకు సర్వీసు చార్జీలు తాము వసూలు చేసుకోవచ్చన్నారు. సర్వీసు చార్జీలను టికెట్ ధరలో చేరుస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోలోని సంబంధిత భాగాన్ని నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ .. గ్రామాలు , మున్సిపాలిటీలు , కార్పోరేషన్ల వారీగా థియేటర్లను వర్గీకరించి టికెట్ ధరలను నిర్ణయించిందని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. భాగస్వాములందిరితో సంప్రదింపులు జరిపిందన్నారు. సర్వీసు ఛార్జీలను టికెట్ ధరలో చేర్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.

ఇదీ చదవండి: ఈ నెల 15, 16న వైఎస్‌ఆర్‌ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.