ETV Bharat / city

HC on kuppam elections: ఎన్నికల అధికారి ఉన్నప్పుడు..ప్రత్యేక అధికారి ఎందుకు?

author img

By

Published : Nov 9, 2021, 9:49 PM IST

Updated : Nov 10, 2021, 6:52 AM IST

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల అధికారిగా పట్టుపరిశ్రమకు చెందిన సుబ్రమణ్యం ఉన్నప్పుడు ప్రత్యేక అధికారిగా పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వరవర్మను ఎందుకు నియమించాల్సి వచ్చిందని ఎన్నికల సంఘాన్ని , ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించారో చెప్పాలంది.

కుప్పం ఎన్నికల ప్రత్యేకాధికారి మార్పు వ్యాజ్యం
కుప్పం ఎన్నికల ప్రత్యేకాధికారి మార్పు వ్యాజ్యం

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రత్యేక అధికారి నియామకంపై అభ్యంతరం ఉంటే పిటిషనర్ వ్యక్తిగతంగా ఎస్ఈసీకి వినతి సమర్పించుకోవాలని స్పష్టంచేసింది . హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల అధికారిగా పట్టుపరిశ్రమకు చెందిన సుబ్రమణ్యం ఉన్నప్పుడు ప్రత్యేక అధికారిగా పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వరవర్మను ఎందుకు నియమించాల్సి వచ్చిందని ఎన్నికల సంఘాన్ని , ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించారో చెప్పాలంది.

మరోవైపు లోకేశ్వరవర్మ నియామకం, ఆయన పనితీరుకు సంబంధించిన అభ్యంతరాలతో ఎస్ఈసీకి వినతి సమర్పించుకోవడానికి పిటిషనరు వెసులుబాటు ఇచ్చింది. వినతి అందిన రెండు రోజుల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. రాజకీయ పార్టీలు ఎస్ఈసీకి ఇచ్చిన వినతి ఆధారంగా తాము ఈ వ్యాజ్యంలో విచారణ చేయడం లేదని తెలిపింది.

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారి లోకేశ్వరవర్మను బాధ్యతల నుంచి తొలగించి తక్షణం మరో ఆర్వోను నియమించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ తెదేపా నుంచి 20 వ వార్డు ఎన్నికల బరిలో ఉన్న వి.వెంకటరమణ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో అదే మున్సిపల్ కమిషనర్లను ఎన్నికల అధికారులుగా నియమించారన్నారు. కుప్పం విషయంలో ప్రత్యేక అధికారిగా పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వరవర్మను నియమించారని తెలిపారు. ఆయన నియామకం వెనుక రాజకీయ కారణాలున్నాయని వాదనలు వినిపించారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేస్తున్నారన్నారు. ఆయన ఆర్వోగా కొనసాగితే నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలిపారు. ఆ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. వేరే మున్సిపాలిటీకి చెందిన కమిషనర్లను ఎన్నికల అధికారిగా మరో ప్రాంతంలో నియమించకూడదనే నిషేధం ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు. చట్ట నిబంధనలు ఏమి చెబుతున్నాయని ఆరా తీశారు .

కుప్పం ఎన్నికల అధికారిగా పట్టుపరిశ్రమకు చెందిన అధికారి సుబ్రమణ్యంను ఎన్నికల అధికారిగా నియమించారని ఎస్ ఈసీ, ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. లోకేశ్వరవర్మ కేవలం ఎన్నికల అధికారికి సహకారం అందిస్తారన్నారు. ఆయనకు ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారాలు లేవన్నారు. ఆ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ .. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలకు సంబంధిత మున్సిపల్ కమిషనర్లను ఎన్నికల అధికారులుగా నియమించినప్పుడు.. కుప్పం విషయంలో ఆ విధానాన్ని ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. ప్రత్యేక అధికారి నియామకానికి అనుసరించిన విధానం ఏమిటీ ? అందుకు సంబంధించిన ఉత్తర్వులేవని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేవలం విజ్ఞప్తి మేరకు నియమించామని ప్రభుత్వ న్యాయవాది శివాజీ బదులివ్వడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తంచేశారు. ఏ చట్ట నిబంధనల మేరకు నియమించారో చెప్పాలని ప్రశ్నించారు.

మరోవైపు లోకేశ్వరవర్మ నియామకం, ఆయన పనితీరుకు సంబంధించిన అభ్యంతరాలతో ఎస్ఈసీకి వినతి సమర్పించుకోవడానికి పిటిషనరు వెసులుబాటు ఇచ్చింది. వినతి అందిన రెండు రోజుల్లో తగిన ఉత్తర్వులు జారీచేయాలని ఎస్ఈసీని ఆదేశించింది. రాజకీయ పార్టీలు ఎస్ఈసీకి ఇచ్చిన వినతి ఆధారంగా తాము ఈ వ్యాజ్యంలో విచారణ చేయడం లేదని .. ప్రత్యేక అధికారి నియామకంపై అభ్యంతరం ఉంటే పిటిషనర్ వ్యక్తిగతంగా ఎస్ఈసీకి వినతి సమర్పించుకోవాలని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. వ్యాజ్యాన్ని పరిష్కరించారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వీల్లేకుండా చట్టం తమ చేతులు కట్టేసిందన్నారు. అయితే నిబంధనలు ఉల్లంఘన జరిగినప్పుడు చర్యలు తీసుకునే విషయంలో ఎస్ఈసీ చేతులు కట్టేసి లేవనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

ఇదీ చదవండి: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో జగన్ భేటీ.. వివాదాలపై కీలక నిర్ణయం

Last Updated : Nov 10, 2021, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.