ETV Bharat / city

Doctor Sudhakar Case: డాక్టర్ సుధాకర్​ కేసులో విచారణ మూడు వారాలకు వాయిదా

author img

By

Published : Jun 24, 2021, 7:15 AM IST

high court
high court

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ కె.సుధాకర్(Doctor Sudhakar) విషయంలో దాఖలు చేసిన తుది నివేదికను అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డికి అందజేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

డాక్టర్ సుధాకర్​(Doctor Sudhakar) విషయంలో దాఖలు చేసిన తుది నివేదికను అందజేయడానికి అభ్యంతరం లేదని.. సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అమికస్ క్యూరీ అందుబాటులో లేకపోవడంతో విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. సీఐబీ తరఫు న్యాయవాది చెప్పిన వివరాల్ని నమోదు చేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

డాక్టర్ సుధాకర్​తో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగ్​ను జత చేస్తూ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను సుమోటో పిల్​గా పరిగణించిన న్యాయస్థానం విచారణ జరిపింది. గతేడాది మే 22న దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. 2020 నవంబర్ 24న సీబీఐ.. తుది స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. సంతృప్తికరంగా లేకపోవడంతో అదనపు డైరెక్టర్ స్థాయికి తగ్గని అధికారి ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని గతేడాది డిసెంబర్​లో ఆదేశాలిచ్చింది. తాజాగా జరిగిన విచారణలో తుది నివేదిక ప్రతిని ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాదికి అందజేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరపు న్యాయవాది చెన్న కేశవులు తెలిపారు . ఇప్పటికే తుది నివేదికను న్యాయస్థానం ముందు ఉంచామన్నారు. ప్రభుత్వం తరపున ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ ఎస్.ఎస్.ప్రసాద్, జీపీ వివేకానంద వాదనలు వినిపించారు. డాక్టర్ సుదాకర్ ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీబీఐ నివేదికను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ నివేదికపై సందేహాలు లేవనెత్తితే వివరణ ఇస్తామన్నారు.

ఇదీ చదవండి: AFFIDAVIT IN SC: పది, ఇంటర్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.