ETV Bharat / city

HC ON GO 55: డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపుపై స్టే పొడిగింపు

author img

By

Published : Oct 22, 2021, 5:02 AM IST

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ(high court on Degree College Admissions)ను నిలుపుదల చేస్తూ.. గతంలో ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరో వారం పొడిగించింది.

high court on Degree College Online Admissions
జీవో నంబర్ 55ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

డిగ్రీ కళాశాలల్లో అన్​లైన్​ అడ్మిషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 55ను సవాలు చేస్తూ.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టిన న్యాయస్థానం(high court on Degree College Online Admissions ).. గతంలో ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులను వారంపాటు పొడిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్​తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదావేసింది. కళాశాలలకు అడ్మిషన్ల కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను మరో వారంపాటు పొడిగించింది.

ఇదీ చదవండి..

HC: టాక్స్‌ రికార్డులు న్యాయస్థానం ముందుంచండి..ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.