ETV Bharat / city

షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

author img

By

Published : Nov 29, 2020, 8:57 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండలో షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.2.50 కోట్లతో గొర్రెల కాపరుల శిక్షణా కేంద్రం ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని పశుసంవర్థక శాఖ డైరెక్టర్​కు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదేశాలు జారీ చేశారు.

Government decision to set up Shepherd Training Center in Penukonda
షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

డిసెంబరు 10న గొర్రెలు, మేకలు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. వైఎస్‌ఆర్ చేయూత, ఆసరా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. 2.49 లక్షల యూనిట్ల పంపిణీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంపిణీకి చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది.

అనంతపురం జిల్లా పెనుకొండలో షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రూ.2.5 కోట్లతో గొర్రెల కాపరుల శిక్షణా కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత గొర్రెల పెంపకం కేంద్రంలోనే శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. గొర్రెల పెంపకంపై శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చదవండీ... ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. మారమ్మకు ఇల్లు కట్టిస్తామని హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.