ETV Bharat / city

పర్యావరణహితంగా పండగ..మట్టి గణపతుల పంపిణీ

author img

By

Published : Sep 1, 2019, 9:04 PM IST

మట్టి గణపతి పూజకు రెడీ..

బొజ్జ గణపయ్య పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. రంగు రంగు విద్యుత్ దీపాలతో అలంకరించిన మండపాలకు.... డప్పు వాయిద్యాలతో కేరింతల నడుమ మండపాలకు చేరుకుంటున్నాడు. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంటూ మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను ప్రతిష్టించేందుకు పలుచోట్ల ఆసక్తి చూపుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహాలను పీసీసీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గురునాథం పంపిణీ చేశారు. ప్రమాదకరమైన రసాయన పూరిత ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను అరికట్టాలని సూచించారు.

తూర్పుగోదావరి జిల్లా
వినాయక చవితి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని మహాలక్ష్మి బుక్స్ దుకాణం ఆధ్వర్యంలో మట్టి గణపతులను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.

పి.గన్నవరం నియోజవర్గంలోని గ్రామాలలో వినాయక చవితి పురస్కరించుకుని సందడి సంతరించుకుంది. బొజ్జ గణపయ్యను పూజించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పూజా సామాగ్రి కొనుగోలు చేస్తున్నారు.

మట్టి గణపతి పూజకు రెడీ..

కృష్ణా జిల్లా
పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నందిగామలో 1100 కు పైగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి 16వ అదనపు జిల్లా సివిల్​ జడ్జి జస్టిస్​ రామ శ్రీనివాసరావు, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రామిరెడ్డి పాల్లొన్నారు.
మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులకు ఆలయ అధికారులు మట్టి గణపతులను అందించారు.
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నగరవాసులకు కలెక్టర్ ఇంతియాజ్ మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.

విశాఖపట్నం జిల్లా
గణేష్ నవరాత్రులను కేవలం పర్యావరణ హితంగానే చేసుకోవాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది విశాఖ. అందులో భాగంగానే విశాఖలోని ప్రజాసంఘాలు, పర్యావరణ సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు... ఉచితంగా మట్టి బొమ్మలను ప్రజలకు అందిస్తున్నారు.

విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లా పార్వతీపురంలో భాజపా అరకు పార్లమెంట్ నాయకులు డాక్టర్ రామ్మోహన్ రావు, నియోజకవర్గ ఇంఛార్జి సురగాల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో 1000 విగ్రహాలు, వాకర్స్ క్లబ్, నాగార్జున సిమెంట్, స్వచ్ఛంద సంస్థలు సుమారు 9000 మట్టి గణపతులను ఉచితంగా భక్తులకు అందజేశారు.
బొబ్బిలిలో పలు సామాజిక సంస్థలతో పాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు, నాయకులు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో మట్టి విగ్రహాల పంపిణీ ఉత్సాహంగా కొనసాగుతుంది .పలు సామాజిక సంస్థలు ముందుకు వచ్చి ఉచితంగా పంపిణీ చేసి మట్టి వినాయకుడికి పూజలు అందించాలని పిలుపునిస్తున్నారు


Body:పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటిని సామాజిక సంస్థలు పంపిణీ చేస్తున్నాయి .పట్టణంలోని ప్రత్యేకంగా స్టాల్స్ను ఏర్పాటు చేసి అందజేస్తున్నారు .అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు నాయకులు మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టారు


Conclusion:గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో అవగాహన కలగడంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసే విగ్రహాల దూరంచేసి మట్టి వినాయకుడిని తీసుకు వెళ్లడం విశేషం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.