ETV Bharat / city

Fire accident in Nalgonda : పరిశ్రమలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

author img

By

Published : Dec 5, 2021, 8:15 PM IST

Fire accident in Nalgonda
Fire accident in Nalgonda

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ట్రాన్స్​ఫార్మర్​లో ఆయిల్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

Fire accident in Nalgonda : తెలంగాణలోని నల్గొండ జిల్లా కట్టంగూర్​ మండలం అయిటిపాములలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని శ్రీ రాఘవేంద్ర ఫెర్రో అల్లాయ్స్​ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నిచారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్‌ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

అగ్ని ప్రమాదం వల్ల భారీగా ఆస్తినష్టం జరిగిందని యాజమాన్యం పేర్కొంది. సుమారు రూ.60 లక్షల నష్టం జరిగిందని పరిశ్రమ యాజమాన్యం వెల్లడించింది. ఎటువంటి ప్రాణహాని జరగకుండా కార్మికులందరినీ బయటకు పంపేసినట్లు తెలిపింది. మరోవైపు హైవేపై దట్టమైన పొగ అలుముకుంది. సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది.

ఇదీ చూడండి: Road accident in chittoor district: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.