ETV Bharat / city

'ఆలయాలమీద దాడులపై సీఎం స్పందించాలి'

author img

By

Published : Sep 17, 2020, 12:28 PM IST

Updated : Sep 17, 2020, 2:46 PM IST

ఆలయాల మీద జరుగుతున్న దాడులపై.. ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని తెదేపా నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. దుర్గ గుడిలో రథానికి ఉండాల్సిన వెండి సింహాలు మాయమైనపప్పటికీ బీమా ఉందని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం దారుణమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ex mnister devineni uma
ex mnister devineni uma

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పసుపు చైతన్యం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ ఘటనలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

  • గుంటూరులో తెదేపా నిరసన

రాష్ట్రంలో దేవాలయాలు, దేవాదాయ ఆస్తులపైన వరుస దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని మాజీమంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులను ఖండిస్తూ గుంటూరు విద్యానగర్ లో తెదేపా నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గ గుడిలో వెండిసింహాలు మాయమైనపప్పటికీ బీమా ఉందని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం దారుణమన్నారు. దుర్గ గుడిలో వెండిసింహాలు ఏ నేత ఇంట్లో ఉన్నాయో తెలియాలని... హిందువుల మనోభావాలను ప్రభుత్వం కాపాడాలని ఆలపాటి డిమాండ్ చేశారు.

వైకాపా ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉంటే ఆలయాలపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. గుడివాడలో మాట్లాడిన ఆయన... ఎన్నికలకు ముందు జగన్ హిందువుగా మారానని మాయమాటలు చెప్పారని దుయ్యబట్టారు. ఇవాళ అధికారంలోకి వచ్చాక దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

ఇంద్రకీలాద్రిపై వివాదం... దేవాదాయశాఖ విచారణ ముమ్మరం

Last Updated : Sep 17, 2020, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.