ETV Bharat / city

బాలినేని బంధువు కాబట్టే జగన్ మాట్లాడటం లేదా..?: జవహర్

author img

By

Published : Jul 18, 2020, 10:45 AM IST

మంత్రి బాలినేని బంధువు కావడం వల్లే సీఎం జగన్ మాట్లాడటం లేదా అని మాజీ మంత్రి జవహర్ నిలదీశారు. ఒక మంత్రికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుతూ రాష్ట్రాలు దాటుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ex-jawahar-minister
ex-jawahar-minister

బాలినేని వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందిచటం లేదని మాజీమంత్రి జవహార్ ప్రశ్నించారు. బాలినేని జగన్ బంధువు కాబట్టి మాట్లాడం లేదా అని నిలదీశారు. చెన్నై నుంచి ఆ నిధులు మారిషస్ కు తరలించేందుకు ప్లాన్ చేశారనేది వాస్తవం కాదా అని మండిపడ్డారు. 5 కోట్లకు పైగా డ‌బ్బు చెన్నై పంపుతూ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి అడ్డంగా బుక్కయ్యారని ఆరోపించారు. ఒక మంత్రికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ వాడుతూ రాష్ట్రాలు దాటుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

మంత్రి బాలినేనిపై పోస్టులు పెట్టిన వారిపై కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.