ETV Bharat / city

Students Fight: ఇంజినీరింగ్​ విద్యార్థుల మధ్య ఘర్షణ..ఆ మెసెజే కారణమా..!

author img

By

Published : Feb 19, 2022, 6:49 AM IST

విజయవాడలో ఇంజినీరింగ్ విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఓ విద్యార్థి.. మరో విద్యార్థికి అసభ్యకరమైన సందేశం పంపడం వల్ల ఈ వివాదం తెలెత్తింది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు.

students fight in vijayawada
students fight in vijayawada

విజయవాడ కానురులోని ఓ ఇంజనీరింగ్ కళశాలలో ఇద్దరు విద్యార్ధుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ విద్యార్ధికి మరో విద్యార్ధి అసభ్యకరంగా సందేశం పంపాడు. ఆ సమాచారాన్ని స్నేహితునికి చెప్పటంతో.. వివాదం చెలరేగింది. ఆవేశంతో ఒకరు మరొకరిపై జామంట్రీ బాక్స్​లోని కంపాస్​తో చేతిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఓ విద్యార్థికి స్వల్ప గాయమైంది. బాధితుడు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఐపీపీ 324 సెక్షన్ నమోదు చేసి దాడి చేసిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్ధులు ఆవేశంతో ప్రవర్తించకూడదని పోలీసులు చెప్పారు. ప్రతి కళశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, పీస్ కమిటీలు వేసి విద్యార్ధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చామని విజయవాడ సెంట్రల్ జోన్ ఏసీపీ తెలిపారు.

ఇదీ చదవండి:

కన్నతల్లిపై అమానుషంగా దాడి చేసిన కసాయి కొడుకు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.