ETV Bharat / city

లోకల్ ఫైట్​: ఎవరు అర్హులు..ఎవరు అనర్హులో తెలుసా?

author img

By

Published : Mar 10, 2020, 8:53 AM IST

Updated : Mar 10, 2020, 10:38 AM IST

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హీట్​ మొదలైంది. అభ్యర్థులు పోటీ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. అయితే పోటీ చేసేందుకు ఎవరు అర్హులు..ఎవరు అనర్హులు.? అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలెంటీ..? చట్టం ఏం చెబుతోందో తెలుసా..!

eligibility for contest in local bodies elections
eligibility for contest in local bodies electionseligibility for contest in local bodies elections

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, పాటించాల్సిన నిబంధనలను ఎన్నికల సంఘం రూపొందించింది. ఎవరు అర్హులు, ఏ పరిస్థితుల్లో అనర్హత వేటు పడుతోందనే విషయాలను స్పష్టంగా తెలుపుతుంది.

అర్హులు

  • అభ్యర్థి వయసు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామపత్రాలు పరిశీలించే తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • పోటీ చేసే వ్యక్తి పేరు సంబంధిత ప్రాదేశిక నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల్లో నమోదై ఉండాలి.
  • అభ్యర్థి ముగ్గురు పిల్లలు కలిగి ఉండి నామపత్రాలు పరిశీలన రోజు ఒక పిల్లవాడు మరణిస్తే ప్రస్తుతం ఆ అభ్యర్థి సంతానం ఇద్దరు గానే భావించి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా భావిస్తారు.
  • నామపత్రాల పరిశీలన నాటికి ఇద్దరు పిల్లలు కలిగి ఉండి మళ్లీ గర్భిణి అయిన మహిళ పోటీకి అర్హురాలే. (నామినేషన్‌ పరిశీలన నాటికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు భావిస్తారు)
  • నామపత్రాలు పరిశీలన రోజునాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదు. పోటీ చేయదలచిన అభ్యర్థి రాజీనామా చేయాలి.. ఆ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాలి.
  • గ్రామపంచాయతికి ఏదైనా ధర్మకర్త హోదాలో కాకుండా ఏవైనా బకాయిపడి ఉండరాదు.
  • రాష్ట్ర శాసన సభల ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న ఏదైన చట్టం కింద అనర్హులుగా ప్రకటించి ఉండరాదు.
  • చౌకధర దుకాణాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న రేషన్‌ డీలర్లు, అంగన్వాడీ సిబ్బంది, సహకార సంఘాల సభ్యులు, మత సంస్థల ఛైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు. దీనిపై న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

అనర్హులు...

  • గ్రామ ఓటరు జాబితాలో పేరులేని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు.
  • ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి 1.6.1996 తర్వాత ముగ్గురు పిల్లలు కలిగి ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
  • పిల్లలను దత్తత ఇచ్చినప్పుడు ఆ పిల్లలు సొంత తల్లిదండ్రులకు చెందిన వారిగానే పరిగణిస్తారు. పోటీ చేసే వ్యక్తి ముగ్గురు పిల్లలు కలిగి ఉండి ఒకరిని దత్తత ఇచ్చినా.. అతనికి ముగ్గురు పిల్లలుగా భావించి పోటీకి అనర్హుడిగా ప్రకటిస్తారు.
  • ఒక వ్యక్తి మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలను కలిగి, భార్య మరణించిన తర్వాత రెండో భార్య ద్వారా మరో సంతానాన్ని పొందితే అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు.
  • మతి స్థిమితం లేని వారు, చెవిటి , మూగవారై ఉండకూడదు.
  • ఒక వ్యక్తి క్రిమినల్‌ న్యాయస్థానం ద్వారా దోషిగా తేలితే అతను ఆ రోజు నుంచి 5 ఏళ్ల వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హుడు.

ఇదీ చదవండి :

జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు...రేపటితో ముగియనున్న గడువు

Last Updated : Mar 10, 2020, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.