ETV Bharat / city

మరో వాయుగుండం..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

author img

By

Published : Nov 30, 2020, 11:24 AM IST

నివర్ తుపాను మిగిల్చిన నష్టం నుంచి కోలుకోక ముందే మరో విపత్తు తరుముకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోంది. బుధ, గురువారం దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

deep depression at Southeastern Bay of Bengal
ముంచుకొస్తున్న మరో వాగుండం

ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో వాయుగుండం బలపడుతుందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. బుధవారం సాయంత్రం శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశముందని వెల్లడించింది.

బుధ, గురువారం దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని... రేపు రాత్రి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణశాఖ హెచ్చరించింది. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లు వెంటనే తిరిగి రావాలని సూచించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు.

ఇదీ చదండి: రైతులను ఆదుకోవాలని తెదేపా నిరసన ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.