ETV Bharat / city

తెలంగాణకు గర్వపడే విప్లవ చరిత్ర ఉంది: సీతారాం ఏచూరి

author img

By

Published : Oct 17, 2020, 10:19 PM IST

తెలంగాణకు గర్వపడే విప్లవ చరిత్ర ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ప్రస్థానంపై పార్టీ ఆ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

cpm general secretary sitharam echuri latest news
తెలంగాణకు గర్వపడే విప్లవ చరిత్ర ఉంది: సీతారాం ఏచూరి

కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ప్రస్థానంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. తెలంగాణకు గర్వపడే విప్లవ చరిత్ర ఉందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో అంతా కలిసి ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగానికి పునాదులైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయంపై దాడులు చేస్తోందని ఆరోపించారు. మైనార్టీలు, దళితులు, గిరిజనులు, మహిళలపై హింస, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ కేంద్రం చేతిలోనే అధికారం ఉండేలా చర్యలు తీసుకుంటున్నదని విమర్శించారు.

విద్య, వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్న నూతన విద్యా విధానం, వ్యవసాయ చట్టాలను ఏకపక్షంగా తీసుకొచ్చిందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని సమస్యలు ఎదురైనా మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఓట్లు, సీట్లు తగ్గినా సైద్ధాంతిక నిబద్ధతతో ముందుకు సాగుతున్నామన్నారు.

ఇదీ చదవండి:

'సీఎం ధోరణి.. న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ప్రమాదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.