ETV Bharat / city

AP, TS Water Dispute: పక్క రాష్ట్ర సీఎం అపహాస్యం చేస్తున్నా చలనం లేదా?: రామకృష్ణ

author img

By

Published : Jul 4, 2021, 9:30 PM IST

సీఎం జగన్ (CM Jagan) పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ (CPI RamaKrishna) విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాల విషయంలో మెతక వైఖరిని కనబరుస్తున్నారని దుయ్యబట్టారు. పక్క రాష్ట్ర సీఎం.. అపహాస్యం చేస్తున్నా చలనం లేకపోవటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు దిల్లీలో విలువ లేదని వ్యాఖ్యానించారు.

cpi ramakrishna
cpi ramakrishna

కృష్ణా జలాల విషయంలో సీఎం జగన్ (cm jagan).. మెతక వైఖరి కనబరుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI RamaKrishna) విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం నదీ జలాల పంపకాల సమయంలోనే 299 టీఎంసీలు తెలంగాణాకు, 511 ఆంధ్రప్రదేశ్ వాటాగా నిర్ణయించిన విషయం గుర్తు చేశారు. అప్పుడు అంగీకరించిన కేసీఆర్ (CM Kcr) ఇప్పుడు మాట మార్చి నదీ జలాల్లో చెరో సగం వాటా అనటాన్ని తప్పుబట్టారు.

సీఎం జగన్ కు దిల్లీలో విలువ లేదన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నా చలనం లేకపోవటం సరికాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలన్నా, ప్రజలన్నా గౌరవం లేదన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రజలు మేల్కొనకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారం కానుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం: సజ్జల

REVANTH REDDY: 'కృష్ణా జలాల్లో 34 % చాలని.. మంత్రిగా ఆనాడు హరీశ్‌ సంతకం పెట్టారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.