ETV Bharat / city

Huzurabad By Poll Result: 'హుజూరాబాద్​' ఉపపోరుపై ఏఐసీసీ సమీక్ష.. ఆ ఓట్లన్నీ ఎటెళ్లాయి?

author img

By

Published : Nov 13, 2021, 2:29 PM IST

Huzurabad By Poll Result
'హుజూరాబాద్​' ఉపపోరుపై ఏఐసీసీ సమీక్ష

తెలంగాణ రాష్ట్రం హుజూరాబాద్ లో జరిగిన ఉపఎన్నికలో ఎదురైన దారుణ ఓటమి (Huzurabad By Poll Result)పై ఏఐసీసీ ఆత్మపరిశీలన చేపట్టింది. దీనిపై ఇప్పటికే.. అధిష్ఠానికి టీపీసీసీ నివేదిక అందించింది. నివేదిక ఆధారంగా.. పోస్టుమార్టం చేపట్టింది.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన హుజూరాబాద్​ ఉపఎన్నిక ఓటమి (Huzurabad By Poll Result)పై ఏఐసీసీ ఆత్మపరిశీలన చేపట్టింది. కేసీ వేణుగోపాల్​ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో దిల్లీలో సమీక్షిస్తున్నారు. ఏఐసీసీ పిలుపుతో టికాంగ్రెస్ నేతలు దిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్‌తో పాటు 13 మంది నేతలు ఏఐసీసీ పెద్దలతో భేటీ అయ్యారు. హుజూరాబాద్​లో ఓటమి (Huzurabad By Poll Result)పై నేతలు వివరణ ఇవ్వనున్నారు.

రేవంత్​పై ఆగ్రహం..
హుజూరాబాద్​లో ఓటమి (Huzurabad By Poll Result)పై ఇప్పటికే టిపీసీసీ అధిష్ఠానికి నివేదిక పంపించింది. టిపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి సారథ్యంలో తొలి ఓటమి (Huzurabad By Poll Result) నమోదైంది. వెంకట్‌ డిపాజిట్‌ కోల్పోవడంతో పాటు.. కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్‌ నేతలు టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై మండిపడ్డారు. ఇందిరా గాంధీ హయాం నుంచి ఉన్న సంప్రదాయ ఓట్లు ఎటు వెళ్లాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగైందనుకున్న ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. బద్వేల్‌ ఉపఎన్నికలో 6వేల ఓట్లు వ‌చ్చాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు భాజపాకు బదిలీ అయినట్లు సీనియర్ల ఫిర్యాదు చేశారు. ఈటలకు బదలాయింపుపై సమావేశంలో చర్చిస్తున్నారు. సీనియర్ల ఫిర్యాదుతో తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో (Huzurabad By Poll Result) ఏం జరిగిందో వివరణ తీసుకోవాలని సోనియా ఆదేశించినట్లు సమాచారం. ఓట్లు తగ్గడానికి కారణాలు, తీసుకున్న వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. మండలాల ఇన్‌ఛార్జుల నుంచి వేణుగోపాల్ సమాచారం సేకరించనున్నారు. రేవంత్‌ నాయకత్వంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో రాజకీయ పరిణామాలు సైతం భాజపా, తెరాస మధ్య హోరాహోరీగా సాగుతుండగా.. కాంగ్రెస్‌ అధిష్టానం తాజా పరిణామాలపై దృష్టి సారించింది. హుజూరాబాద్​తో పాటు దుబ్బాక, నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో ఓటమిపైనా చర్చించాలని ఇప్పటికే పొన్నం ప్రభాకర్‌ డిమాండ్ చేయగా ఏఐసీసీలో చర్చిస్తారా లేదా అనేది తేలనుంది.

దిల్లీకి వెళ్లిన నేతలు..
టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(clp leader batti Vikramarka), ఇద్దరు ఏఐసీసీ ఇంఛార్జీ కార్యదర్శులు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, హుజూరాబాద్​ ఉపఎన్నికల అభ్యర్థి బల్మూరి వెంకట్‌, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ తదితరులు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి: Jagananna Gorumudda : ఇక.. ‘జగనన్న గోరుముద్ద’లు తినిపించే బాధ్యత వారిదేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.