ETV Bharat / city

'దిలీప్‌కుమార్‌.. భారత సినీ పరిశ్రమకు ఓ ట్రెండ్ సెట్టర్'

author img

By

Published : Jul 7, 2021, 4:18 PM IST

Updated : Jul 7, 2021, 7:29 PM IST

బాలీవుడ్​ దిగ్గజ నటుడు దిలీప్​ కుమార్ ​(Dilip Kumar) మృతిపై ప్రముఖులు సంతాపం తెలిపారు. దిలీప్‌కుమార్‌ మృతితో.. భారతీయ సినీ ప్రపంచంలో ఓ శకం ముగిసిందన్నారు.

Actor Dilip Kumar dies
నటుడు దిలీప్‌కుమార్‌ మృతి

బాలీవుడ్ ట్రాజెడీ కింగ్​ దిలీప్ కుమార్ మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. దిలీప్ కుమార్.. విభిన్నమైన నటనతో భారత సినీ రంగంలో ట్రెండ్ సెట్టర్​గా నిలిచారని, తరతరాల నటులకు ఆయన ప్రేరణ అని చెప్పారు. ఐదు దశాబ్దాల ఆయన సినీ ప్రస్థానంలో దేశం గర్వించదగ్గ గొప్ప నటుడిగా నిలిచారని కీర్తించారు.

తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు: సీఎం జగన్​

బాలీవుడ్​ నటుడు దిలీప్‌కుమార్‌ మృతిపట్ల సీఎం జగన్​ విచారం వ్యక్తం చేశారు. బాలీవుడ్ లెజెండ్‌ మృతి తనను ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దిలీప్ కుమార్ కుటుంబసభ్యులు, అభిమానులకు సంతాపం తెలిపారు. సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప నటుడు దిలీప్‌కుమార్‌ అని కీర్తించారు.

ఆయన మరణం.. బాధించింది: చంద్రబాబు

ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ మరణవార్త తననెంతో బాధించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. "తరతరాల సినీ ప్రేమికుల్లో చెరగని ముద్ర వేసిన దిలీప్ కుమార్, భారతీయ సినిమా పరిశ్రమలో ఓ గొప్ప నటుడిగా ఎదిగారు. ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం" అని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

ఇదీ చదవండి:

Dilip Kumar: పండ్ల వ్యాపారం నుంచి దిగ్గజ నటుడి స్థాయికి..

Last Updated : Jul 7, 2021, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.