ETV Bharat / city

Cm jagan: విశాఖ రాజధాని, నామినేటెడ్ పదవులపై గవర్నర్​తో సీఎం చర్చ

author img

By

Published : Jun 14, 2021, 5:11 PM IST

Updated : Jun 15, 2021, 4:49 AM IST

Governor Biswa Bhusan Harichandan
nominated MLCs in ap

17:01 June 14

నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లు ఆమోదంపై గవర్నర్‌తో చర్చ

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి దంపతులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి పలు అంశాలపై మాట్లాడారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. విశాఖలో ఉన్న వనరులు, అభివృద్ధికి ఉన్న అవకాశాలు వంటి వివరాలను ముఖ్యమంత్రి వివరించారు. ఏపీపీఎస్సీ, ఎస్టీ కమిషన్‌, తదితర కమిషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామక ప్రక్రియా చర్చకు వచ్చింది. ఇటీవలే దిల్లీకి వెళ్లి వచ్చిన సీఎం ఆ పర్యటనకు సంబంధించి వివరాలను, రాష్ట్రంలో కొవిడ్‌ నియంత్రణకు చేపట్టిన చర్యలను వివరించారు.

నామినేటెడ్‌ పదవులపై సీఎం సమీక్ష: నామినేటెడ్‌ పదవుల భర్తీపై కసరత్తులో భాగంగా సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ వైకాపా ప్రాంతీయ బాధ్యులైన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డితో సమీక్షించారు. మిగిలిన ముగ్గురు పార్టీ ప్రాంతీయ బాధ్యులు సమావేశానికి రాలేదు. వారు తమ జాబితాలను ముఖ్యమంత్రికి పంపినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొన్ని మార్పులు చేర్పులను ముఖ్యమంత్రి సూచించారు. జాబితాను ఖరారు చేసి మూడు నాలుగు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:

Encroached Lands in Visakha: ఆక్రమణలపై సినిమా ఇంకా పూర్తి కాలేదు: మంత్రి అవంతి

Last Updated : Jun 15, 2021, 4:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.