ETV Bharat / city

హైదరాబాద్​లో వరద బాధితులకు అండగా ఉండండి: చంద్రబాబు

author img

By

Published : Oct 20, 2020, 2:39 PM IST

భాగ్యనగరంలో వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తెదేపా కార్యకర్తలు అండగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రజల భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ట్విటర్​ వేదికగా పేర్కొన్నారు.

Chandrababu tweet on Hyderabad Floods
చంద్రబాబు

హైదరాబాద్​లో అవసరమైనచోట తెదేపా కార్యకర్తలు, నాయకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జలప్రళయం తగ్గే వరకు హైదరాబాద్ వాసులు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎవరికి వారు సురక్షితంగా ఇళ్లలోనే ఉండి కుటుంబసభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ప్రజల భద్రత కోసం తాను ప్రార్థిస్తున్నట్లు ట్విటర్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.