ETV Bharat / city

ఇదో ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయనో ఫేక్ సీఎం: చంద్రబాబు

author img

By

Published : Nov 30, 2020, 5:48 PM IST

Updated : Nov 30, 2020, 7:59 PM IST

శాసససభ శీతాకాల సమావేశాల తొలిరోజు.. వైకాపా నేతలు స్పందించిన తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఇదొక ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయనొక ఫేక్ సీఎం అంటూ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి అన్నారు. నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ఆ విషయాన్ని సభలో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రైతుల విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ ఫేక్ లెక్కలేనని చెప్పారు. రైతుల కోసం తాను తొలిసారి పోడియం ముందు కూర్చోవలసి వచ్చిందన్నారు.

chandrababu-naidu
chandrababu-naidu

మీడియాతో తెదేపా అధినేత చంద్రబాబు

శీతాకాల సమావేశాల తొలిరోజు శాసనసభలో వేడి పుట్టింది. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో సెగలు రేగాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు పోడియం ముందు బైఠాయించగా.. ప్రభుత్వం ఆయనతో సహా.. తెదేపా శాసనసభ్యులను సస్పెండ్ చేసింది. సభలో వైకాపా వ్యవహరించిన తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. శాసనసభ ద్వారా ప్రజలకు అబద్దాలు చెబుతూ... వాటిని అడ్డుకుంటున్న తమను సభ నుంచి బయటకు పంపారని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని... ఇదొక ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయన ఫేక్ సీఎం అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కోసం.. సభా నియమాలకు విరుద్ధంగా శాసనసభను ఆలస్యంగా మొదలుపెట్టడం దారుణమన్నారు. పంచాయతీరాజ్ బిల్లుపై చర్చించకుండా ఏకపక్షంగా ఆమోదించారని ఆరోపించారు. పంటనష్టంపై ప్రభుత్వం గాలి కబుర్లు చెబుతోందన్న ఆయన... ఏడాదిలోనే లక్షా 25 వేల కోట్లు అప్పు చేశారని ఆక్షేపించారు. రామానాయుడును ఎద్దేవా చేస్తూ సీఎం మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు.

నా రాజకీయ చరిత్రలో నేనెప్పుడూ పోడియంలోకి వెళ్లలేదు. పరిటాల రవి హత్య సందర్భంలో కూడా నేను పోడియంలోకి వెళ్లలేదు. రైతుల విషయంలో సీఎం తీరు నచ్చకే బైఠాయించా. - చంద్రబాబు, తెదేపా అధినేత

తాను 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశానని.. తప్పుడు ప్రకటనలు ఇస్తున్న సీఎంను తొలిసారి చూస్తున్నానని చంద్రబాబు అన్నారు. సభలో వైకాపా నేతలు నీచంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులపై చర్చిద్దామని ఎంత చెప్పినా వినిపించుకోలేదని చెప్పారు.

వరదల వల్ల పంటలు పూర్తిగా పాడయ్యాయి. కౌలురైతులు కూడా బాగా నష్టపోయారు. ఏడాదిలోనే లక్షా 20 వేల కోట్లు అప్పు చేశారు. గాలిమాటలు చెప్పడం.. గాలిలో తిరగడం.. ఇది కాదు బాధ్యత అంటే. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత లేదా..? పంటల బీమా ప్రీమియంపై అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు. పంటల బీమా రూ.1300 కట్టుంటే రైతులకు సాయం అందేది- చంద్రబాబు, తెదేపా అధినేత

తొలిసారిగా పోడియంలోకి వెళ్లా: చంద్రబాబు

బీ కేర్ పుల్....

"గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి. ఫేక్‌ ఫెలోస్‌ వచ్చి రాష్ట్ర భవిష్యత్‌తో ఆడుకుంటారా? మమ్మల్ని అవమానిస్తారా? నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు! ఏం చేస్తారు నన్ను.. చంపేస్తారా? రైతులకు తీవ్రనష్టం వాటిల్లితే దానిపై చర్చించకుండా వక్రీకరించి మీ ఇష్టప్రకారం మాట్లాడతారా? ప్రతిపక్ష నేతకు మైక్‌ ఇవ్వరా? ప్రతిరోజూ అవమానాలు భరించాలా? ప్రజల కోసం పోరాడుతున్నా. వారి కోసమే నా జీవితంలో ఎప్పుడూ లేని తిట్లు, అవమానాలు జరుగుతున్నా భరిస్తున్నా. వైకాపా సభ్యులు సభలో ఇష్టానుసారం వెకిలినవ్వులు నవ్వుతారా? బీ కేర్‌ఫుల్‌! చాలా మందిని చూశా’’ అంటూ తీవ్రస్థాయిలో సీఎం జగన్‌, వైకాపా సభ్యులపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

'రైతుల సమస్యలపై మాట్లాడితే సస్పెండ్ చేస్తారా?'

విశాఖలో భూముల కొనుగోలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదా? అని చంద్రబాబు.. ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజల కోసం తొలిసారి అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని అన్నారు. ప్రతిపక్ష నేతను వైఎస్‌ఆర్ కూడా గౌరవించేవారని గుర్తు చేశారు. పద్ధతి లేకుండా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కక్షలు, విధ్వంసాలు.. రాజకీయాల్లో పనికిరావని హితవు పలికారు. సస్పెండ్ చేసింది తమను కాదని.. రైతులను అని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలపై మాట్లాడుతుంటే సస్పెండ్ చేస్తారా? ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

నూతన సాగు చట్టాలతో రైతులకు మేలే: మోదీ

Last Updated : Nov 30, 2020, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.