ETV Bharat / city

complaint on cheppal add: వివాదాస్పద ప్రకటన... నెటిజన్ల ఆగ్రహం

author img

By

Published : Oct 14, 2021, 9:10 PM IST

పండుగ వచ్చిందంటే చాలు.. అందుకు తగ్గట్టుగా ప్రకటనలు(advertisement ideas) చేస్తూ.. వ్యాపార యాజమాన్యాలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. క్రియెటివ్​ జీనియస్​లను రంగంలోకి దించి.. వాళ్ల మేధస్సుకు పని చెప్తారు. తీవ్ర కసరత్తుల తర్వాత.. రకరకాల ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు(advertisement ideas) చేస్తుంటారు. అయితే.. ఈ ప్రకటనలు ఆ పండుగ నేపథ్యాన్ని తెలియజేస్తూనే.. జనాలను ఆకర్షించాలి. అయితే ఈ ప్రయత్నంలో కొందరు జీనియస్​ల క్రియేటివిటీ(advertisement ideas)... ఒక్కోసారి శ్రుతి మించి వివాదాలకు కారణమవుతుంది. ఇప్పుడు ఓ హైదరాబాద్​కు చెందిన ఓ చెప్పుల తయారీ సంస్థ చేసిన ప్రకటన(advertisement poster design) సంచలనంగా మారింది.

వివాదాస్పదంగా ప్రకటన
వివాదాస్పదంగా ప్రకటన

ఈ బతుకమ్మ, దసరా పండుగలకు బట్టలు, చెప్పులు అంటూ.. పాషింగ్​ అవకాశాలు(festival shopping) చాలా ఎక్కువ. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని వ్యాపార సంస్థలు ఉవ్విళ్లూరుతుంటాయి. అందుకు తగ్గట్టుగా తీవ్ర కృషి చేస్తుంటాయి. క్రియేటివ్​ ప్రకటనలు(shopping ads), మార్కెటింగ్​ స్ట్రాటజీల(advertisement ideas)తో జనాల్లోకి దూసుకెళ్లి.. వ్యాపార లాభాలు పొందేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాయి. ఎలా అయితే వినియోగదారులు ఆకర్షితులవుతారు..? అనే దానిపై మదనం(advertisement ideas) చేస్తారు. రకరకాల కాన్సెప్టులతో తయారు చేసిన పోస్టర్లు, వీడియోలు, గ్రాఫిక్స్​(shopping ads)లను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తారు. ఇదే సమయంలో.. ఓ చెప్పుల తయారీ సంస్థ చేసిన ప్రయోగం(advertisement poster design).. జనాల్లోకి అయితే పోయింది. కానీ.. లాభాలు వెనకేసుకోవాల్సిన సంస్థ కాస్తా.. వాళ్ల తిట్లదండకాలను మూటలు కట్టుకుంటోంది. నెటిజన్ల ఆగ్రహం చవిచూస్తోంది.

అసలు అందులో ఏముందంటే..

చెప్పులు కొందామని ఇంటర్​నెట్​లో వెతకగా.. సదరు కంపెనీ యాడ్​ కనిపించింది. ఎంటా ఆ యాడ్​ అని ఓపెన్​ చేసి చూస్తే.. చెప్పులు కొందామన్న ఉత్సాహం సంగతి అటుంచితే.. ఆ యాడ్​ కింద చెప్పుకోలేని మాటలతో కామెంట్లు రాసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. దసరా పండుగ సందర్భంగా జనాలు ఆడుకునే దాండియా కాన్సెప్ట్​తో రెండు పోస్టర్లను సంస్థ తయారు చేసింది. అయితే ఇందులో ఒకటి అమ్మాయిది, ఇంకోటి అబ్బాయిది. కాగా.. ఈ రెండు పోస్టర్లలో వాళ్లు దాండియా ఆడుతూ కన్పిస్తారు. ఇందులో వివాదమేముంది అనుకుంటున్నారా..? ఇద్దరితో ఆడుతున్న ఎదుటి భాగస్వామి మనిషి కాకపోవటమే ఇక్కడ అసలు సమస్యకు కారణమైంది. అమ్మాయేమో.. అబ్బాయిలు వేసుకునే స్యాండిల్​తో.. అబ్బాయేమో అమ్మాయి వేసుకునే హైహీల్స్​తో దాండియా ఆడుతున్నారు. సంప్రదాయానికి సంబంధించిన ఓ ఆటను చెప్పులతో ఆడించటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అందులో ఉన్న అమ్మాయి, అబ్బాయిలు వేసుకున్న చెప్పులను హైలెట్​ చేస్తూ.. మార్కెటింగ్​ చేసుకోవాలి. కానీ.. ఏకంగా చెప్పులతో ఆటను ఆడిస్తూ.. డిజైన్​ చేయటమనేది.. దాండియాను కించపరచటమే అంటూ.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులకు ఫిర్యాదు..

పండుగను సొమ్ము చేసుకునే క్రమంలో.. హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారంటూ.. ఆ యాడ్​ చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు సంస్థ నిర్వాహకులపై హైదరాబాద్​లోని కర్మాన్​ఘాట్​కు చెందిన న్యాయవాది ప్రదీప్​.. సరూర్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చెప్పుతో మహిళ దాండియా ఆడుతున్నట్లు పోస్టర్ రూపొందించిన సంస్థ నిర్వాహకులు, డిజైనర్​పై చర్యలు చేపట్టాలని అడ్వకేట్ ప్రదీప్ కుమార్ డిమాండ్​ చేశారు. ఫిర్యాదుపై విచారించి చట్టపరమైన చర్యలు చేపడతామని సీఐ సీతారాం తెలిపారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ.. నెటిజన్లు తిట్ల దండకాలు అందుకుంటున్నారు.

ఇదీ చూడండి:

TIRUMALA: అశ్వ వాహనంపై శ్రీవారి దర్శనం... రేపటితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.