ETV Bharat / city

"రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుంటే..రాజధానిని ఎందుకు కట్టడంలేదు..?"

author img

By

Published : Jul 29, 2022, 1:08 PM IST

Updated : Jul 29, 2022, 2:09 PM IST

BJP
అమరావతిలో భాజపా పాదయాత్ర

Somuveeraju: రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుంటే రాజధాని ఎందుకు కట్టడంలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రాజధాని విషయంలో కేంద్రం ఎక్కడా మోసం చేయలేదన్న ఆయన, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుంటే..కేంద్రం ఇచ్చిన బియ్యంను ఎందుకు పంపిణీ చేయటంలేదని నిలదీశారు. గుంటూరు జిల్లా భాజపా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అమరావతిలో చేపట్టిన పాదయాత్రను సోము వీర్రాజు ప్రారంభించారు.

Somuveeraju: రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుంటే రాజధాని ఎందుకు కట్టడంలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా భాజపా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ అమరావతిలో చేపట్టిన పాదయాత్రను సోమువీర్రాజు ప్రారంభించారు. 'మనం-మన అమరావతి' పేరుతో పాదయాత్ర సాగనుంది. ఆగష్టు 4వ తేదీ వరకు రాజధాని గ్రామాల్లో నేతలు పాదయాత్ర చేయనున్నారు. మొదటి రోజు పాదయాత్ర ఉండవల్లి నుంచి పెనుమాక, కృష్ణాయపాలెం, యర్రబాలెం వరకు కొనసాగనుంది.

రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేశారని, ఇందుకు వైకాపాతో పాటు తెదేపా కూడా కారణమేనని సోమువీర్రాజు ఆరోపించారు. వెంకయ్యనాయుడు రాజధాని కోసం రూ.2,500 కోట్లు నిధులు ఇప్పించారని... రాజధాని కుట్టకుండా రెండు పార్టీలు రైతులను మోసం చేశాయన్నారు. అమరావతిలో నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సోమువీర్రాజు డిమాండ్‌చేశారు. రాజధాని కోసం తీసుకున్న భూముల్లో ఏమేం చేస్తారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

రాజధాని విషయంలో కేంద్రం ఎక్కడా మోసం చేయలేదన్న సోమువీర్రాజు... ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బైపాస్ రహదారులు, ప్లై ఓవర్లు నిర్మించామని తెలిపారు. రాజధానిలో అంతర్గత రహదారులు, డ్రైనేజ్ నిర్మాణం కూడా కేంద్రం చేపడుతోందన్నారు. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయటంలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని అన్నారు. గత ముఖ్యమంత్రి వైకాపా ఉచ్చులో పడకుండా ఉంటే బాగుండేదన్నారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి... కేంద్రం కంటే బాగుందని విజయసాయిరెడ్టి చెబుతున్నారని కేంద్రం కంటే బాగుంటే కేంద్రం ఇచ్చిన బియ్యం ఎందుకు పంపిణీ చేయటంలేదని నిలదీశారు. ఎందుకు రోజూ అప్పుల కోసం పరిగెడుతున్నారని ప్రశ్నించారు. రాజధాని రైతులను ఆదుకోవడంపై భాజపా దృష్టి సారిస్తుందన్నారు. పోలవరం పరిహారానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని జగన్ చెబుతున్న ప్రింటింగ్ మిషన్ కేంద్రం వద్ద ఉండదని తెలిపారు. పోలవరం ఏటీఎం కాకూడదని, ఆర్​ఆర్ ప్యాకేజ్ నివేదిక రాష్ట్రం... కేంద్రానికి ఇవ్వటంలేదని సోమువీర్రాజు ఆరోపించారు.

సోమువీర్రాజును నిలదీసిన రైతులు: అమరావతిలో భాజపా పాదయాత్రలో సోమువీర్రాజును రైతులు నిలదీశారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ముందుకు రావాలని ఓ రైతు కోరారు. రాజధానిని చంద్రబాబు నిర్మించారని తెలిపారు. భాజపా, వైకాపా తోడు దొంగలని తెలిపిన మరో రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాజధాని నిర్మిస్తే భాజపాకు ఓటేస్తారా అని రైతులను సోమువీర్రాజు ప్రశ్నించారు.

అమరావతిలో భాజపా పాదయాత్ర

ఇవీ చదవండి:

Last Updated :Jul 29, 2022, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.