ETV Bharat / city

పరీక్షలు వాయిదా వేయండి.. సీఎంకు గ్రూప్-1 అభ్యర్థుల వినతి

author img

By

Published : Dec 5, 2020, 3:58 PM IST

మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని సీఎం జగన్​ను గ్రూప్​-1 అభ్యర్థులు కోరారు. డిసెంబర్ 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తే తాము పూర్తిస్థాయిలో సిద్ధం కాలేమని విన్నవించారు. పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు.

appsc group1 candidates request to cm jagan
appsc group1 candidates request to cm jagan

డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న గ్రూప్​-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని సీఎం జగన్​ను గ్రూపు-1 అభ్యర్థులు కోరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అభ్యర్థులు స్పందనలో విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుతో ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ కు 1378 మంది అభ్యర్థులు అర్హత పొందామని.. డిసెంబర్ 14 నుంచి పరీక్షలు నిర్వహిస్తే తాము సిద్ధం కాలేమని తెలిపారు.

అదేరోజు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ నియామక పరీక్షలు ఉన్నాయని వివరించారు. వీటిలో యూపీఎస్సీ, రైల్వే, స్టాఫ్ సెలక్షన్, ఏపీసెట్ పరీక్షలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గ్రూప్-1 పరీక్షలను 3 నెలలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు.

ఇదీ చదవండి

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బసినికొండ వీఆర్వో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.