ETV Bharat / city

'వారందరికీ రూ.10 వేలు ఆర్థిక సాయం అందించండి'

author img

By

Published : May 28, 2020, 1:46 PM IST

కేంద్రం విధించిన నాలుగు లాక్​డౌన్​ వల్ల ఎటువంటి ప్రయోజనం కలగలేదని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆరోపించారు. స్పీకప్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రానికి పలు డిమాండ్లు పంపారు. వలస కూలీలకు 200 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలన్న ఆయన... పేదలు, చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

సాకే శైలజానాథ్
సాకే శైలజానాథ్

దేశంలో విధించిన నాలుగు లాక్‌డౌన్‌ల వల్ల కలిగిన ప్రయోజనమేమీ లేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. మోదీ ప్రభుత్వం వల్ల కోట్లాది మంది వలస కూలీలు నష్టపోయారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్​ ఇందిరాభవన్​లో నిర్వహించిన స్పీకప్ ఇండియా కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ సాయం పెద్దలకు తప్ప పేదలకు అందలేదని శైలజానాథ్ ఆరోపించారు. వలస కార్మికులను ఉచితంగా వారి స్వస్థలాలకు పంపాలని, ఆదాయపన్ను పరిమితిలోకి రానివారికి తక్షణమే రూ.10 వేలు ఆర్థికసాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులు వారి సొంత ఊళ్లకు చేరాక, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 పనిదినాలు కల్పించాలన్నారు. పేదలు, చిన్న తరహా పరిశ్రమలకు నగదు బదిలీ చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

భూముల్ని లాక్కోవద్దంటూ అధికారుల్ని అడ్డుకున్న గ్రామస్తులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.