ETV Bharat / city

ప్రధాన వార్తలు@11AM

author img

By

Published : Jul 20, 2022, 10:58 AM IST

Updated : Jul 20, 2022, 11:37 AM IST

.

ap top news
ap top news

  • సీబీఐకి ఎందుకు అప్పగించకూడదు..మంత్రి కాకాణి నిందితుడిగా ఉన్న కేసులపై హైకోర్టు ప్రశ్న..
    గత ఏప్రిల్​ నెలలో నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆధారాలు చోరీకి గురైన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించే వ్యవహారంపై వాదనలు ముగిశాయి. కోర్టులో ఆధారాల చోరి కేసు మాత్రమే కాకుండా.. కాకాణి గోవర్థన్ రెడ్డి, తదితరులపై పెండింగ్‌లో ఉన్న ఫోర్జరీ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఎన్టీఆర్​ ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్‌ రాజీనామా..! వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు వెల్లడి..
    ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌ నియామకానికి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కె.శంకర్​ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • Lalitha Bhai: మంత్రిని నిలదీసిన ఘటనలో అధికార పార్టీ నుంచి ప్రాణహాని ఉంది: లలితాబాయి..
    అధికార పార్టీ వారి నుంచి ప్రాణహాని ఉందని.. తనకు రక్షణ కల్పించాలని సత్యసాయి జిల్లా కొత్తచెరువు పోలీసులను శెట్టిపల్లి తండాకు చెందిన మహిళ ఆశ్రయించింది. గత శనివారం మాజీ మంత్రి శంకర్​ నారాయణను ఈమె నిలదీసిన సంగతి తెలిసిందే.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • (Blood donation) మందుబాబులకు రక్తదానం తప్పనిసరి చేసే యోచనలో తెలంగాణ సర్కార్..
    ఫూటుగా మందు తాగి.. వాహనాలు నడిపితే.. జరిమానా, లైసైన్స్ రద్దుతో పాటు.. రక్తదానం చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా..! పంజాబ్ రాష్ట్రం అమలు చేస్తున్న ఈ వినూత్న కఠిన చర్యల్ని..తెలంగాణ లోను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికార్లు. చుక్క లోపల పడితే.. నెత్తురు కళ్లచూడటమేనా..అని అనుకుంటున్నారు మందుబాబులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ప్రేమ పేరుతో యువకుడి మోసం.. చెంపలు వాయించిన యువతి..
    ఝార్ఖండ్​ ధన్​బాద్​లో ఓ యువకుడిని యువతి చితకబాదింది. దుగ్దాకు చెందిన ఓ యువకుడు.. మతం మార్చుకుని అమాయక యువతులను మోసం చేస్తున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ బాధిత యువతి.. యువకుడిని తీవ్రంగా కొట్టింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అందం.. అభినయంతో..యమలీల 'సుజాత' ట్రెండింగ్​..
    అందం, నటన, క్యూట్​ స్మైల్​, మాటలతో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది నటి సోనియా సింగ్​. 'హే పిల్ల', 'రౌడీ బేబీ', 'సాఫ్ట్​వేర్​ సావిత్రి', 'ఓయ్​ పద్మావతి' ఇలా ఎన్నో సిరీస్​లతో ఆకట్టుకుంది. ఈటీవీలో ప్రసారమయ్యే 'యమలీల' సీరియల్​లో చిన్ని పాత్రతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ అమ్మడు ప్రస్తుతం 'అలా సుజాత దరికి చేరిన సుబ్రమణ్యం' అనే వెబ్​సిరీస్​ చేస్తోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • 8రోజుల్లో కామన్వెల్త్‌ పోటీలు.. మనోళ్లు అదరగొడతారా?..
    కామన్వెల్త్‌ క్రీడలు మరో ఎనిమిది రోజుల్లో మొదలు కాబోతున్నాయి. ఈ సారి పోటీల్లో కొన్ని కొత్త ఆటలు చేరిన నేపథ్యంలో భారత్​కు కూడా ప్రాతినిథ్యం పెరిగింది. దీంతో ఈ మెగా టోర్నీలో సత్తా చాటి పతకాలు సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఆటగాళ్లు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ప్రస్తుతం ట్రేడింగ్​లో లాభాలు కష్టమే.. ఆ వ్యూహం పాటించండి'..
    ప్రస్తుతు పరిస్థితుల్లో ట్రేడింగ్​తో ప్రతిఫలాలు రావడం కష్టమేనన్నారు స్విస్ పెట్టుబడిదారు మార్క్ ఫాబర్​. పెట్టుబడులపై లాభాలు రాకున్నా.. తక్కువగా నష్టపోయే వ్యూహాన్ని అనుసరించాలని సూచించారు. ఈ మేరకు 'ఇన్ఫామిస్ట్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • శ్రీలంకకు కొత్త నాయకత్వం.. బుధవారం అధ్యక్షుడి ఎన్నిక..
    గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు కొత్త నాయకత్వం రాబోతోంది. దేశ నూతన అధ్యక్షుడు, ప్రధానమంత్రిని బుధవారం ఎన్నుకోనున్నారు. అధ్యక్షుడిగా దులస్‌ అలహాప్పెరుమాకు విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Last Updated : Jul 20, 2022, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.