ETV Bharat / city

పన్ను ఎగవేతలు తగ్గించడంపై ఏపీ దృష్టి

author img

By

Published : Oct 22, 2021, 1:44 PM IST

జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశాన్ని వర్చువల్​లో నిర్వహించారు. ఇందులో కచ్చితమైన డేటా, వ్యాపార లావాదేవీల సమగ్ర విశ్లేషణ, నకిలీ ఇన్వాయిస్‌ల తగ్గింపు, పన్ను ఎగవేతను తగ్గించడం, నియంత్రణ అధికారులు-పన్ను వంటి అంశాలపై చర్చించారు.

ap-government-focus-on-reducing-tax-evasion
పన్ను ఎగవేతలు తగ్గించడంపై ఏపీ దృష్టి

జీఎస్టీ కౌన్సిల్‌ 45వ సమావేశాన్ని గురువారం వర్చువల్‌లో నిర్వహించారు. ఐటీ సవాళ్లు, ఆదాయ సమీకరణపై జీఎస్టీ విధానంలో సంస్కరణల కోసం కన్వీనర్‌, ఏడుగురు సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్‌గా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ఉండగా, సభ్యుడిగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి ఎంపికయ్యారు.

వర్చువల్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ్‌ హాజరయ్యారు. కచ్చితమైన డేటా, వ్యాపార లావాదేవీల సమగ్ర విశ్లేషణ, నకిలీ ఇన్వాయిస్‌ల తగ్గింపు, పన్ను ఎగవేతను తగ్గించడం, నియంత్రణ అధికారులు-పన్ను చెల్లింపుదారుల మధ్య సమాచారాన్ని పంచుకోవడంలాంటి అంశాలను వివరించారు.

ఇదీ చూడండి: CBN: సరిదిద్దుకోలేని తప్పు చేశారు.. సీఎం, డీజీపీలపై బాబు ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.