ETV Bharat / city

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చ

author img

By

Published : Feb 23, 2021, 1:19 PM IST

Updated : Feb 23, 2021, 5:50 PM IST

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తీర్మానం చేయాలని కేబినెట్​ నిర్ణయించింది. ఈబీసీ నేస్తం పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్‌ఆర్‌ స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు ఆమోదించింది.

ap cabinet decisions
ap cabinet decisions

సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేబినెట్​ చర్చించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై చర్చించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేబినెట్​ నిర్ణయించింది. ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వచ్చే మూడేళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈ పథకం ద్వారా రూ.45వేలు అందించనున్నారు. రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

వైఎస్‌ఆర్‌ స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపికకు కేబినెట్​ ఆమోదం తెలిపింది. కడప జిల్లాలో 2 పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చించారు. కడప జిల్లా కొప్పర్తి గ్రామంలో 598.59 ఎకరాల భూమి మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుపై మంత్రివర్గంలో ప్రతిపాదనకు వచ్చింది. కడప జిల్లా అంబాపురం గ్రామంలో మరో మెగా ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు 93.99 ఎకరాల కేటాయించే అంశంపైనా చర్చించారు. ఈ భూమిలను ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి ఉచితంగా ఇచ్చే అంశంపై మంత్రులు చర్చించారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 3148 ఎకరాల భూమిని ఎకరం రూ.1.65 లక్షలకు విక్రయించే అంశంపై కెబినెట్ చర్చించింది.

తూర్పుగోదావరి జిల్లా కొన గ్రామంలో 165.34 ఎకరాల భూమిని ఏపీ మారీటైమ్ బోర్డుకి ఎకరం 25 లక్షల చొప్పున విక్రయించే అంశం ప్రతిపాదనలపై చర్చ జరుగింది. కాకినాడ ఎస్ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్ఈజెడ్ పరిధిలో ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది.

ఇదీ చదవండి: దుర్గగుడిలో సోదాలపై ప్రభుత్వానికి అ.ని.శా ప్రాథమిక నివేదిక

Last Updated : Feb 23, 2021, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.