ETV Bharat / city

రాష్ట్రానికి మరో 20వేల కొవిడ్ టీకాలు

author img

By

Published : Jan 14, 2021, 7:24 AM IST

Updated : Jan 14, 2021, 11:19 AM IST

ఏపీకి మరో 20వేల కొవిడ్ టీకా డోస్​లు గన్నవరం విమానాశ్రయానికి చేరాయి. వ్యాక్సిన్లను ప్రత్యేక వాహనంలో గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.

Another 20,000 Kovid vaccine doses reached in AP
రాష్ట్రానికి మరో 20వేల కొవిడ్ టీకాలు

రాష్ట్రానికి మరో 20 వేల కొవిడ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి భారత్ బయోటెక్​కు చెందిన కొవాగ్జిన్ వ్యాక్సిన్లు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరాయి. టీకాలను ప్రత్యేక కంటైనర్ ద్వారా గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు.

వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లు తుది దశకు చేరాయి. రాష్ట్రస్థాయి నిల్వకేంద్రంనుంచి జిల్లా కేంద్రాలకు చేరిన టీకాలను.. క్షేత్రస్థాయికి తరలిస్తున్నారు. శనివారం నుంచి....దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభంకానండగా... రాష్ట్రంలో తొలిదశలో 4 లక్షల 96 వేల మంది కరోనా పోరాట యోధులకు టీకా వేయనున్నారు.

కడప జిల్లాలో...

కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి బుధవారం 28,500 వ్యాక్సిన్లను కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య తీసుకొచ్చారు. వ్యాక్సిన్లను జిల్లాలో ఎంపిక చేసిన 20 ఆరోగ్య కేంద్రాలకు పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు. ఈనెల 16 నుంచి వ్యాక్సిన్లను వేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా హెల్త్ వర్కర్లకు ఈ డోసులు ఇవ్వనున్నారు.

విశాఖలో..

విశాఖ జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మొదటి విడతగా ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంబై నాలుగు మంది ఆరోగ్య సిబ్బందికి సరిపడా వ్యాక్సిన్ జిల్లాకు వచ్చింది. ఈనెల 16న ముప్పై రెండు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం ప్రతి కేంద్రానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. నాలుగు రూట్లు గా విభజించి పోలీసుల పర్యవేక్షణలో వ్యాక్సిన్ రవాణా చేయనున్నారు.

వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ రోజున ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించేలా అన్ని కేంద్రాల్లోనూ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో రెండు చోట్ల వ్యాక్సినేషన్ సిబ్బందితో ప్రధాని మాట్లాడనున్నారు. నగరంలోని చిన్న వాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ సిబ్బందికి ఈ అవకాశం లభించింది. ఈ మేరకు ఆ కేంద్రంలో ప్రధానితో మాట్లాడేందుకు టు వే కమ్యూనికేషన్ సిస్టం కల్పించారు. అక్కడే జిల్లా మంత్రులు అధికారులు పాల్గొని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపనున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి 4.77 లక్షల డోసులు... నేడు జిల్లాలకు తరలింపు

Last Updated : Jan 14, 2021, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.