ETV Bharat / city

మహిళా దినోత్సవం: రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

author img

By

Published : Mar 8, 2021, 7:21 AM IST

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రాత్రి పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహిళల భద్రతే తమ బాధ్యతంటూ ర్యాలీ ద్వారా భరోసా కల్పించారు. దిశ యాప్‌ వలన కలిగే ఉపయోగాలను పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

womens day ap
పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా విజయవాడలో పోలీసు మహిళా సిబ్బందికి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని తల్లిదండ్రులకు పోలీసు కమిషనర్‌ సూచించారు. నందిగామలో పోలీసు మహిళా సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో విద్యార్థినిలు, వివిధ మహిళా సంఘాలు కాగడాల ప్రదర్శన చేశారు. గుడివాడలో జిల్లా ఎస్పీ రవీంద్రబాబుతో పాటు సబ్‌ డివిజన్‌ పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు కలిసి క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

కాగడాల ప్రదర్శన..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలో మహిళా పోలీసులు వారి కుటుంబసభ్యులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గుంటూరులో పోలీసుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తాడికొండలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. వినుకొండలో ప్రధాన వీధుల గుండా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నరసరావుపేటలో డీఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థినిలు పల్నాడు రోడ్‌ నుంచి మల్లమ్మ సెంటర్‌ వరకూ క్యాండిల్లతో ప్రదర్శన చేశారు.

పెద్ద ఎత్తున మహిళల మానవహారం..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో పోలీసులు భారీగా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. వైద్యులు క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకినాడలో జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం చేశారు. మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని.. నరసాపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథ్‌ అన్నారు. ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో మహిళా లోగో చుట్టూ మహిళలు పెద్దఎత్తున మనవహారంగా ఏర్పడి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. నెల్లూరులో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు కాగడాల ప్రదర్శన చేశారు. కందుకూరులో మహిళా పోలీసులు క్యాండిల్ల ప్రదర్శన నిర్వహించారు.

రాయలసీమ జిల్లాల్లో ..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని రాయలసీమ జిల్లాల్లోనూ కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. కర్నూలులో మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. అదోని, కోడుమూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. అనంతపురం, పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి, రాయదుర్గం, కల్యాణదుర్గంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండీళ్లతో ర్యాలీ నిర్వహించారు. శింగనమల, నార్పల, బుక్కరాయసముద్రం, మడక శిర మండలాల్లో విద్యార్థినిలు కాగడాల ప్రదర్శనలు చేశారు. కడప, పులివెందుల, రైల్వే కోడూరు, జమ్మలమడుగులో పోలీసులు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. మహిళాదినోత్సవం సందర్భంగా తిరుపతిలో మహిళా పోలీసులు కాగడాల ప్రదర్శన చేశారు.

శ్రీకాకుళంలో మహిళల ర్యాలీ..

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని పాత బస్టాండ్‌ జంక్షన్‌లో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మహిళ లేనిదే సృష్టి లేదంటూ నరసన్నపేటలో నిర్వహించిన ప్రదర్శనలో విద్యార్థులు నినాదాలు చేశారు. పాలకొండలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద విద్యార్థినిలు కొవ్వొత్తులతో మానవహారం చేశారు. ఆమదాలవలసలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. విజయనగరంలో ఆడపుడుచులకు చిరుసత్కారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విశాఖలో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ అన్నారు.

ఇదీ చదవండి: అసిస్టెంట్​గా​ మహిళ ఉందని రైలు నడిపేందుకు లోకోపైలట్ నిరాకరణ​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.