ETV Bharat / city

తెలంగాణ: ఖాజిపల్లి అర్బన్​ పారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్​

author img

By

Published : Sep 7, 2020, 6:35 PM IST

ప్రభాస్​
ప్రభాస్​

హైదరాబాద్ నగర శివారు దుండిగల్ సమీపంలో ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్​ను హీరో ప్రభాస్ దత్తత తీసుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, ఎంపీ సంతోశ్​తో కలిసి శంకుస్థాపన చేశారు. 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఇందుకోసం తక్షణ సాయంగా ప్రభాస్​ రెండు కోట్ల రూపాయలు అందించారు.

ఖాజిపల్లి అర్బన్​ పారెస్ట్​ను దత్తత తీసుకున్న ప్రభాస్​

తెలంగాణలోని హైదరాబాద్ నగర శివారు దుండిగల్‌ సమీపంలో ఖాజిపల్లి అర్బన్‌ ఫారెస్టు పార్క్‌కు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోశ్​ ‌కుమార్​తో కలిసి యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్ శంకుస్థాపన చేశారు. ఈ పార్కును ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దీంతో ఔటర్ రింగ్‌ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్టు పార్కు అందుబాటులోకి రానుంది. తన తండ్రి దివంగత యూవీఎస్‌ రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతాన్ని అభివృద్ది చేయనున్నట్లు ప్రభాస్ తెలిపారు.

ఈ పార్కు నిర్మాణం కోసం 1,650 ఎకరాల అటవీ భూమిని ఎంపీ సంతోశ్​ కుమార్‌ చొరవతో దత్తత తీసుకున్న ప్రభాస్​... రెండు కోట్ల రూపాయలు అందించారు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలను ప్రభాస్ పరిశీలించారు. అనంతరం సంతోశ్​ కుమార్​తో కలిసి ప్రభాస్ మొక్కలు నాటారు.

త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్టు బ్లాక్‌ల దత్తతకు ప్రయత్నిస్తానని ఎంపీ సంతోశ్​ ‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీ ఎఫ్‌ శోభ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.