ETV Bharat / city

'మన బంగారాలు' నిఖత్​జరీన్​, ఇషాసింగ్​కు ఘన స్వాగతం..

author img

By

Published : May 27, 2022, 8:20 PM IST

Grand welcome to Champions: ప్రపంచ మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో సత్తా చాటిన తెలంగాణ తేజం నిఖత్​ జరీన్​.. టోర్నీ అనంతరం తొలిసారి స్వరాష్ట్రానికి వచ్చిన తరుణంలో ఘన స్వాగతం లభించింది. ఆ రాష్ట్ర క్రీడాశాఖతో పాటు క్రీడాకారులు, అభిమానులు పెద్దసంఖ్యలో శంషాబాద్​ చేరుకుని.. నిఖత్​తో పాటు యువ షూటర్​ ఇషా సింగ్​కు ఘనంగా స్వాగతం పలికారు.

1
1

'మన బంగారాలు' నిఖత్​జరీన్​, ఇషాసింగ్​కు ఘన స్వాగతం..

Grand welcome to Champions: ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణ పతక విజేత, తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్.. హైదరాబాద్​కు చేరుకుంది. ఛాంపియన్​షిప్​ గెలుచుకున్న అనంతరం తొలిసారి తెలంగాణకు వస్తోన్న నిఖత్​జరీన్​కు.. ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో రాష్ట్ర క్రీడా శాఖ ఘన స్వాగతం పలికింది. నిఖత్​తో పాటు జర్మనీలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్​షిప్​లో గోల్డ్ మెడల్స్ సాధించిన సికింద్రాబాద్​కు చెందిన ఇషా సింగ్, ఫుట్​బాల్​ ప్లేయర్​ సౌమ్య​ కూడా హైదరాబాద్​ చేరుకున్నారు. ముగ్గురు తెలంగాణ తేజాలకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డితో పాటు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

A Grand welcoనిఖత్​ జరీన్​కు డప్పు, ఒగ్గుడోలు, గిరిజన కళాకారుల స్వాగతంme
నిఖత్​ జరీన్​కు డప్పు, ఒగ్గుడోలు, గిరిజన కళాకారుల స్వాగతం

నిఖత్ జరీన్​కు ఘన స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి క్రీడాకారులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. డప్పు, ఒగ్గుడోలు, గిరిజన కళాకారులు తమ నృత్యాలతో తెలుగు తేజాలను స్వాగతించారు. విమానాశ్రయం నుంచి నిఖత్​జరీన్​, ఈషాసింగ్​, సౌమ్య.. ప్రత్యేక వాహనాల్లో భారీ ర్యాలీతో వారివారి నివాసాలకు చేరుకున్నారు.

తెలుగు  తేజాలకు ఘన స్వాగతం..
తెలుగు తేజాలకు ఘన స్వాగతం..

"తెలంగాణ ప్రభుత్వం సహకారం వల్లే ఈ పతకం సాధించగలిగాను. భారత్​, తెలంగాణ కోసం ఈ పతకం గెలిచాను. నా విజయానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. మొదటి నుంచి నాకు తోడుగా ఉన్న వాళ్లందరికీ ధన్యవాదాలు. మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, ప్రశాంత్​రెడ్డి, వైంకటేశ్వర్​రెడ్డి ముందు నుంచి మంచి సపోర్ట్​ ఇచ్చారు. ఈరోజు ఇక్కడి వరకు రాగలిగానంటే..ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహం వల్లే.​ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ తెలంగాణకు, దేశానికి పేరు తీసుకొచ్చేందుకు మరిన్ని పథకాలు తీసుకువస్తా." - నిఖత్​జరీన్​, ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ గోల్డ్​మెడలిస్ట్​

A Grand welcome
'మన బంగారాలు' నిఖత్​జరీన్​, ఇషాసింగ్​కు ఘన స్వాగతం..

"మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ ఛాంపియన్​గా నిలిచింది నిఖత్. ఇప్పుడు తెలంగాణకు పేరు తేవటమే కాదు.. ప్రపంచమే నివ్వెర పోయేలా చేసింది. ఒలింపిక్స్​లో పతకం సాధిస్తానని నిఖత్ మాటిచ్చింది. నిఖత్​తో పాటు ఇషాసింగ్​ కూడా షూటింగ్​లో బంగారు పతకం సాధించి తెలంగాణకు పేరు తెచ్చింది. ఇద్దరు తెలంగాణ బంగారాలు నిఖత్, ఇషా సింగ్​కు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నాం. తెలంగాణలో ఇలాంటి ఆణిముత్యాలు ఎంతో మంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నాం. క్రీడాకారులకు రిజర్వేషన్లు కల్పించాం. రాష్ట్రం బాగుపడుతుంటే కొంతమంది బాధ పడుతున్నారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి మేలురకమైన క్రీడాకారులను తయారు చేసి పంపుతాం." - శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ క్రీడా శాఖ మంత్రి

"తెలంగాణకు నిఖత్ జరీన్ గర్వకారణం. ప్రపంచ ఛాంపియన్​గా నిలవడం మాములు విషయం కాదు. ఎంతో కఠోర శ్రమ చేసింది. ఇషా సింగ్ షూటింగ్​లో మూడు పథకాలు సాధించడం గర్వ కారణం." - వేముల ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ మంత్రి

సాధించిన పతకాలు చూపిస్తోన్న ఛాంపియన్లు....
సాధించిన పతకాలు చూపిస్తోన్న ఛాంపియన్లు....

ఇటీవల టర్కీ ఇస్తాంబుల్​లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్​లో 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్​ స్వర్ణ పతకం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్​ మెడల్​తో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పతకం గెలిచిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తం మీద ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పసిడి గెలిచిన అయిదో భారత బాక్సర్‌గా నిలిచింది నిఖత్‌. మహిళల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ విభాగంలో మను బాకర్‌, పాలక్‌తో కలిసి హైదరాబాదీ టీనేజర్‌ ఇషాసింగ్​ స్వర్ణం గెలిచింది. తుది సమరంలో భారత్‌ 16-8తో జార్జియా (సలోమ్‌, మరియాం, ప్రొడియాష్‌విలి)పై నెగ్గింది. మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సౌరభ్‌ చౌదరితో కలిసి ఇషా పసిడి గెలుచుకోగా.. రెండు స్వర్ణాలు తన ఖాతాలో పడ్డాయి.

తెలుగు బంగారాలకు స్వాగతం పలికేందురు తరలివచ్చిన చిన్నారులు..
తెలుగు బంగారాలకు స్వాగతం పలికేందురు తరలివచ్చిన చిన్నారులు..

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.