ETV Bharat / city

TOP NEWS: ప్రధానవార్తలు @9PM

author img

By

Published : May 21, 2022, 8:59 PM IST

TOP NEWS
TOP NEWS

.

  • 'ఎమ్మెల్సీని అరెస్టు చేస్తేనే శవపరీక్షకు అంగీకరిస్తాం'
    ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఎమ్మెల్సీని అరెస్టు చేస్తేనే శవపరీక్షకు అంగీకరిస్తామని బాధిత కుటుంబసభ్యులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోంది: చంద్రబాబు
    ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. కాకినాడ జీజీహెచ్​ వద్ద తెదేపా నిజ నిర్థారణ కమిటీని అడ్డుకోవడాన్ని ఖండించిన చంద్రబాబు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీఎం దావోస్ పర్యటన రహస్యమేమీ కాదు - మంత్రి బుగ్గన
    ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం తెదేపాకి ఒక అలవాటుగా మారిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. సీఎం పర్యటన రహస్యమేమీ కాదని బుగ్గన అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • '30 ఏళ్లుల్లో.. ఒక్క రోడ్డు వేయలేకపోయారు..'
    'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వైకాపా నేతలకు నిరసనల ఎదురవుతున్నాయి. 30 ఏళ్లుగా అధికారంలో ఉంటున్నప్పటికీ మా గ్రామానికి ఒక్కటంటే ఒక్క సిమెంట్ రోడ్డు కూడా రాలేదని నిలధీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సొరంగంలో పెను విషాదం.. తొమ్మిది మృతదేహాలు వెలికితీత
    జమ్ముకశ్మీర్‌లోని నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గం కూలిన ఘటనలో.. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ దుర్ఘటనలో మృత్యువాతపడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'భారత- చైనా సరిహద్దుల్లో ఉక్రెయిన్​ లాంటి పరిస్థితులు'
    ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితుల్లాగే డోక్లాం మొదలైన భారత్​- చైనా సరిహద్దు ప్రాంతాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కేంద్రం.. ఈ సమస్యపై చర్చించేందుకు అనుతిచించకపోవడమే కాక మాట్లాడే వారి గొంతు నొక్కుతోందని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'మాపై అత్యాచారాలు ఆపండి'.. కేన్స్​లో నగ్నంగా ఉక్రెయిన్​ మహిళ నిరసన
    ఉక్రెయిన్​లో మహిళలపై రష్యా సైనికులు దారుణంగా వ్యవహరిస్తున్నట్లు ఓ మహిళ కేన్స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ అత్యాచారాలను ఆపాలంటూ నగ్నంగా నిరసన తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్​, వంటగ్యాస్​​​ ధరలు
    దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్‌, డీజిల్‌, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్‌, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్‌ పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రపంచ నెం.1కు మరోసారి షాకిచ్చిన భారత యువ గ్రాండ్​మాస్టర్
    భారత యువ గ్రాండ్​మాస్టర్​ ప్రజ్ఞానంద్ మరోసారి సంచలనం సృష్టించాడు. ఫిబ్రవరిలో జరిగిన 'ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ టోర్నమెంట్‌'లో ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన అతడు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రశాంత్​నీల్​​ మల్టీవర్స్​.. 'కేజీఎఫ్​ 2' సీక్వెల్స్​గా 'సలార్​', 'ఎన్టీఆర్​ 31'?
    ప్రభాస్​ 'సలార్​'కు సీక్వెల్​గా 'ఎన్టీఆర్​ 31' రాబోతుందని ప్రచారం సాగుతోంది. అంతకుముందు 'కేజీయఫ్​ 2'కు 'సలార్'​ సీక్వెల్​ అని టాక్​ కూడా వచ్చింది. మరికొంతమంది 'కేజీయఫ్​ 2' సీక్వెల్స్​గా 'సలార్'​, 'ఎన్టీఆర్​ 31' ఉంటుందని అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.