ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : Jun 5, 2022, 8:58 PM IST

ap top news
ap top news

.

  • పది ఫలితాల విడుదలకు.. ముహూర్తం ఖరారు
    పదో తరగతి పరీక్ష ఫలితాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • "పొత్తు"రాజకీయంలో.. తగ్గేదెవరు..? నెగ్గేదెవరు..??
    రాష్ట్రంలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది.. ఎన్నికలు రేపోమాపో ఉన్నాయా.. అన్నంతగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి పార్టీలు! కొంత కాలంగా చర్చల్లో ఉన్న పొత్తు రాజకీయం.. నిన్న పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో మరింత ఊపందుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కేసీఆర్ చెప్పింది నిజమే.. జగన్ జైలుకెళ్లటం ఖాయం: దేవినేని
    పోలవరం ఎత్తు తగ్గించడానికి జగన్ సిద్ధమని కేసీఆర్‌ చేసిన ప్రకటనలో వాస్తవం లేకుంటే.. సీఎం జగన్, మంత్రులు ఎందుకు ఖండించలేదని మాజీమంత్రి దేవినేని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితుల నిధుల్లో జరిగిన అవకతవకలపై చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విషవాయువు కలకలం
    అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విషవాయువు కలకలం రేపింది. గ్యాస్ లీకేజీపై బ్రాండిక్స్‌ కంపెనీ ప్రతినిధులు పీసీబీకి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పర్యావరణానికి అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవాలి'
    ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన 'లైఫ్​స్టైల్​ ఫర్​ ఎన్విరాన్​మెంట్​ మూవ్​మెంట్' కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఒడిశా కొత్త మంత్రివర్గంలో 21 ఎమ్మెల్యేలకు ఛాన్స్
    ఒడిశా కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు, అనారోగ్య కారణాల వల్లే అసెంబ్లీ స్పీకర్ పాత్రో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన మంత్రివర్గంలో చేరడం లేదని ఆయన కుమారుడు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కీవ్​పై విరుచుకుపడ్డ రష్యా..
    గత నెలరోజులుగా ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరం ఆదివారం మరోమారు బాంబుల శబ్దాలతో దద్దరిల్లింది. తెల్లవారుజామున రష్యా వైమానిక దళాల నుంచి దూసుకొచ్చిన క్షిపణులు కీవ్‌లోని పలు భవనాలను ధ్వంసం చేసినట్లు ఆ ప్రాంత మేయర్‌ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
    బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,750గా ఉండగా.. కిలో వెండి ధర రూ. 63,600గా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దీపక్​ చాహర్​ రిసెప్షన్​.. డ్యాన్స్​లతో క్రికెటర్ల సందడి
    టీమ్‌ఇండియా మీడియం పేసర్‌ దీపక్‌ చాహర్‌.. ఆగ్రాలో తన ప్రేయసి జయ భరద్వాజ్​ను పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. అనంతరం రిసెప్షన్​ కూడా అట్టహాసంగా జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సల్మాన్​ఖాన్​కు బెదిరింపుల లేఖ
    బాలీవుడ్​ సూపర్​స్టార్​ సల్మాన్​ ఖాన్​ను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం బీటౌన్​లో కలకలం రేపింది. ఈ మేరకు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనకు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.