ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : May 30, 2022, 8:58 PM IST

ప్రధాన వార్తలు @9PM
TOP NEWS

.

  • సివిల్స్- 2021 ఫలితాలు.. సత్తా చాటిన తెలుగు తేజాలు
    UPSC Exam Results: సివిల్స్‌ -2021 తుది ఫలితాలు విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం నిర్వహించిన పరీక్షలో 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో శృతి శర్మకు మొదటి ర్యాంకు, అంకిత అగర్వాల్‌కు రెండో ర్యాంకు, గామిని సింగ్లాకు మూడో ర్యాంకు వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మూడేళ్ల పాలనపై సీఎం జగన్‌ ట్వీట్
    ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. సంక్షేమ పాలనతో మూడేళ్లు పూర్తి చేసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా.. ప్రజల ప్రేమ, ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతోందంటూ.. ఆయన ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రజాసమస్యలపై దూకుడుగా పోరాడండి: చంద్రబాబు
    ఒంగోలులో నిర్వహించిన మహానాడు ప్రజావిజయంగా తెదేపా అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమలాపురంలో ఇంకా.. ఆ సెక్షన్లు అమల్లోనే: ఎస్పీ సుబ్బారెడ్డి
    అమలాపురంతో సహా కోనసీమ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొందని కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అమలాపురంలో 144సెక్షన్, పోలీస్ చట్టం 30 ఇంకా.. అమలులోనే ఉన్నాయని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​' పథకానికి శ్రీకారం
    కొవిడ్​ కారణంగా అనాథలైన పిల్లలకు సాయం అందించే పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరు వారితోనే ఉన్నారనే భరోసాను కల్పిస్తుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హవాలా కేసులో ఆరోగ్య శాఖ మంత్రి అరెస్ట్
    దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ అరెస్టు చేసింది. కోల్​కతా కేంద్రంగా పనిచేసే ఓ సంస్థతో సంబంధమున్న హవాలా కేసులో ఆయన్ను సోమవారం అదుపులోకి తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్​కు ఐరాస హెచ్చరిక
    అఫ్గానిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ.. తన మ్యాగజైన్‌లో పేరు మార్చడంపై ఐక్యరాజ్య సమితి.. భారత్‌ సహా ఆయా దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. అఫ్గాన్‌ నుంచి కశ్మీర్‌ వరకు ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జూన్​ 1 నుంచి కొత్త రూల్స్​..
    జూన్​ 1వ తేదీ నుంచి పలు సంస్థలు కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువస్తున్నాయి. వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే ఆ కీలక మార్పులను తెలుసుకోకపోతే జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. మంగళవారం అమలులోకి రానున్న కొన్ని ముఖ్యమైన మార్పులు ఏమిటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్​ 2022లో ఎవరెవరు ఏమేం సాధించారంటే?
    రెండు నెలలకు పైగా సాగిన ఐపీఎల్​ 15వ సీజన్‌ ఎట్టకేలకు పూర్తయింది. కొత్త జట్టు గుజరాత్‌ ఆడిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచింది. సుదీర్ఘంగా జరిగిన ఈ టోర్నీలో పలువురు ఆటగాళ్లు కొత్త రికార్డులతో ఆకట్టుకున్నారు. అవేంటో, వారు సాధించిన ఘనతలేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'విరాటపర్వం' విడుదల తేదీ మార్పు !
    రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన 'విరాటపర్వం' సినిమా విడుదల తేదీ మారింది. అనుకున్న తేదీ కన్నా ముందే ప్రేక్షకుల ముందుకురాబోతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.