ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9AM

author img

By

Published : May 28, 2021, 9:01 AM IST

.....

top news
ప్రధాన వార్తలు

  • Mahanadu-2: ఇవాళ యుగపురుషుడికి తెలుగుదేశం ఘన నివాళులు

తెలుగునాట అన్నా అన్న పదం ఆయన్ను చూసే పుట్టిందని భావిస్తారంతా. అశేష ఆంధ్రావనికి ఆ పేరే తారకమంత్రం. సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసుకుని చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ అన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనటంలో అతిశయోక్తి లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CM Jagan review: నేడు పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్‌ సమీక్ష!

నేడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. పనుల పురోగతిపై సీఎంకు అధికారులు వివరించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Corona: ఉమ్మడి కుటుంబంలో విషాదం..నెల రోజుల వ్యవధిలో నలుగురు కరోనాతో మృతి

కరోనా విలయంలో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో తెలియని పరిస్థితి. కొవిడ్‌తో కుటుంబంలో కొందరు మరణిస్తే.. మిగిలినవాళ్లు భవిష్యత్తుపై ఆందోళనతో బతకాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Luck: పుడమి పుత్రుడు.. ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యాడు!

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరిలో ఓ రైతుకు అదృష్టం కలిసొచ్చి ఒక్కరోజులోనే కోటీశ్వరుడయ్యారు. పొలానికి వెళ్తున్న రైతుకు మెరుస్తున్న రాయి కనిపించింది. తనతోపాటు ఇంటికి తీసుకొచ్చిన రాయిని.. స్థానిక వ్యాపారికి చూపించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరెంటు తీగలు రాసుకొని మంటలు- పేలిన సిలిండర్​

మధ్యప్రదేశ్​ అగర్​ మాలవలోని నల్​ఖేడాలో భగవతి హోటల్​కు సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. గాలి ఎక్కువగా వీయడం వల్ల కరెంటు తీగలు రాసుకుని మంటలు వ్యాపించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IMD: ఒకరోజు ముందే కేరళకు నైరుతి రుతుపవనాలు

బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు వచ్చాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 31న ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనాపై ఆ పోస్టుల్ని ఇక తొలగించం: ఫేస్​బుక్​

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 'కరోనా మానవ సృష్టే లేదా ప్రయోగశాలలో రూపొందించిందే' వంటి ఆరోపణలతో కూడిన పోస్టులను తమ యాప్​ల నుంచి తొలగించబోమని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • inflation: కరోనా వేళ.. ద్రవ్యోల్బణానికి రెక్కలు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా.. ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు ఇంధన ధరలు జనజీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CRICKET RECORD: 52 ఏళ్ల వయసులో టెస్టు ఆడిన క్రికెటర్

లేటు వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్​ ఆడి, సరికొత్త రికార్డు సృష్టించాడు ఆ క్రికెటర్. 52 ఏళ్లప్పుడు తన చివరి టెస్టులో పాల్గొన్నాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • NTR Birthday: అలా.. ఎన్టీఆర్​ కోరికతో!

'శ్రీనాథుడి' కథ గురించి ప్రజలకు అంతగా అవగాహన లేదని.. అది సినిమాగా తెరకెక్కిస్తే నష్టపోవాల్సి వస్తుందని బాపు రమణలు.. సీనియర్ ఎన్టీఆర్​తో అన్నారట. అయినా సరే నిష్ఠతో చేద్దామంటూ ఆయన​ చెప్పగా.. అలా ఆ సినిమాను పట్టాలెక్కించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.