ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Jun 30, 2022, 4:59 PM IST

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

..

  • నాకేం జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌, డీజీపీదే బాధ్యత: ఎంపీ రఘురామ
    MP RRR: 'ఆంధ్రా పోలీసులు.. అర్ధరాత్రి అరాచకాలు చేస్తున్నారు. నాకేం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌, డీజీపీదే బాధ్యత' అని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్రంలో పోలీసుల నుంచే రక్షణ కోరే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అధికారులు పిట్ట కథలు చెబుతున్నారు'
    జీపీఎఫ్​లో సొమ్ము మళ్లింపుపై న్యాయపోరాటం చేస్తామని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ పేర్కొన్నారు. సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిసి జీపీఎఫ్​లో డబ్బులు డెబిట్​ కావడంపై వివరణ కోరినట్లు చెప్పారు. ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు ఏమయ్యాయంటే.. పిట్ట కథలు చెబుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్ ఇంజినీరు
    కర్నూలు నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీరు సురేంద్రబాబు.. రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కాడు. స్థానికంగా గుత్తేదారుకు బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్​ చేయడంతో గుత్తేదారు అనిశాను ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెదేపా కార్యకర్త అరెస్ట్​పై నేతల ఆగ్రహం..
    TDP LEADERS PROTEST: యూట్యూబ్ నిర్వాహకుడు వెంకటేశ్‌ అరెస్టుపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐడీ సీఐ జగదీశ్‌ దురుసుగా ప్రవర్తించారని.. సీఐ సహా పలువురిపై ప్రైవేటు కేసు వేయాలని తెదేపా నిర్ణయించింది. గతంలోనూ సీఐ జగదీష్ పలు మార్లు వివాదాస్పదంగా వ్యవహరించారని ఆరోపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహారాష్ట్ర సీఎంగా ఏక్​నాథ్ శిందే.. రాత్రికి ప్రమాణ స్వీకారం
    Fadnavis CM oath today: మహారాష్ట్రలో నాటకీయ పరిణామాలకు తెరదించుతూ రాష్ట్రంలో భాజపా సర్కారు కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి పదవిని ఏక్​నాథ్ శిందేకు కేటాయిస్తూ భాజపా సంచలన నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కన్హయ్య లాల్ ఇంటికి సీఎం.. ఉదయ్​పుర్​లో భారీ ర్యాలీ
    ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్య లాల్​ కుటుంబ సభ్యులను పరామర్శించారు రాజస్థాన్ సీఎం అశోక్​ గహ్లోత్. మరోవైపు.. హత్యను నిరసిస్తూ.. ఉదయ్​పుర్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఘటనపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరవేగంగా పట్టణ జనాభా వృద్ధి.. భారత్​లో 2035 నాటికి 67 కోట్లు!
    ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 56 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా 2050 నాటికి ఆ సంఖ్య 68 శాతానికి చేరనుంది. మరోవైపు భారత్‌లో ప్రస్తుతం 48 కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఆవాసం ఏర్పరచుకోగా.. 2035 నాటికి ఆ సంఖ్య 67 కోట్ల 50 లక్షలకు చేరనుందని ఐరాస నివేదిక వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జులై 1 నుంచి క్రెడిట్ కార్డులకు కొత్త రూల్స్​.. కస్టమర్లకే బెనిఫిట్​!
    కొత్త క్రెడిట్​ కార్డుల జారీ, ప్రస్తుతమున్న కార్డుల అప్​గ్రేడ్ విషయంలో ఆర్​బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బిల్లింగ్​ తేదీలు, క్రెడిట్ కార్డుల క్లోజింగ్ విషయంలోనూ మార్పులు చేసింది. వినియోగదారులకు మేలు చేసేలా ఉన్న ఈ మార్గదర్శకాలేంటి? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్టార్​ ఓపెనర్​ సర్జరీ సక్సెస్​.. త్వరలోనే టీమ్​ ఇండియాలోకి రీ ఎంట్రీ!
    టీమ్​ ఇండియా సీనియర్​ ఓపెనర్​, వైస్​ కెప్టెన్ కేఎల్​ రాహుల్​.. సర్జరీ విజయవంతం అయింది. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ఈ స్టార్​ క్రికెటర్​.. త్వరలోనే భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం.. ఓ టెస్టు, వన్డే, టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్​లో పర్యటిస్తోంది భారత్​. ​ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలీసులను ఆశ్రయించిన సీనియర్​ నటి పవిత్ర
    Senior Actor Naresh Pavitra lokesh Marriage: సీనియర్ నటి పవిత్రా లోకేష్​.. సైబర్​ పోలీసులను ఆశ్రయించారు. కొందరు సోషల్​మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.