ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Jun 27, 2022, 4:59 PM IST

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

..

  • 'ఎలక్షన్లు రాబోతున్నాయి.. తెదేపా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి'
    Director Raghavendra Rao: రాష్ట్రంలో 'ఎలక్షన్​లు రాబోతున్నాయి.. తెదేపా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి' అని ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. అన్నగారి(ఎన్టీఆర్) ఆశీస్సులతో మంచి రోజులు వస్తాయని ఆయన హితవు పలికారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా తెనాలిలోని పెమ్మసాని థియేటర్​లో 'వేటగాడు' సినిమాను వీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కళ్లముందే బిడ్డ మరణంతో... తల్లడిల్లిన గోమాత!
    తల్లి ప్రేమ గొప్పదనాన్ని చాటిచెప్పే సంఘటన ఇది. రహదారిపై ఓ ఆవు తన బిడ్డతో కలిసి ఆహారం కోసం ప్రయాణం సాగిస్తుంది. అదే సమయంలో ప్రమాదవ శాత్తు అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో .. ఆవు దూడ చనిపోయింది. అది చూసిన తల్లి ఆవు మూగ రోదన.. మాతృప్రేమకు అద్ధం పట్టింది. గంటల తరబడి చనిపోయిన బిడ్డను నెమరుతూ.. అక్కడే ఉండిపోయింది ఆ గోమాత. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Amravati farmers : 'ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే.. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తాం'
    Amravati farmers : ప్రభుత్వ తీరుపై అమరావతి రైతులు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులతో చర్చలు జరిపిన తర్వాతే.. రాజధాని భూములను వేలం వేయాలని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే కచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ధర్మాసనం దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CM Jagan: మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉంది: సీఎం జగన్‌
    CM Jagan Srikakulam Tour: సమాజం, దేశం, మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉందని..ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేవలం జగనన్న అమ్మఒడి కింద ఇప్పటి వరకు రూ.19,618 కోట్లు జమ చేశామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెచ్చిపోయిన దొంగలు.. గన్స్​తో వచ్చి చోరీ.. అడ్డొచ్చిన యజమాని హత్య
    బిహార్​లో దొంగలు రెచ్చిపోయారు. వైశాలి జిల్లాలోని హజిపుర్ పట్టణంలో ఓ ఆభరణాల దుకాణాన్ని దోచేశారు. ఐదారుగురు ఆయుధాలతో వచ్చి చోరీకి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన నగల దుకాణం యజమానిని దుండగులు చంపేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నిత్యానంద ఆశ్రమం నుంచి నా కూతుర్ని రక్షించండి'.. తండ్రి ఆవేదన
    నిత్యానంద ఆశ్రమం నుంచి తన కుమార్తెను రక్షించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శిందే వర్గానికి సుప్రీంలో ఊరట.. అప్పటివరకు పదవులు సేఫ్​!
    Maharashtra politics: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్​ అనర్హత వేటు నోటీస్ పంపడాన్ని సవాల్ చేస్తూ ఏక్​నాథ్ శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై స్పందన తెలపాలని శివసేన నాయకులు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​, కార్యదర్శి, కేంద్రానికి నోటీసులు పంపింది. అలాగే స్పీకర్ నోటీసులకు సమాధానం చెప్పాలని రెబల్​ ఎమ్మెల్యేలకు సూచించింది. జులై 11 సాయంత్రం ఐదున్నర వరకు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా...
    Gold Price Today: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ.52,710గా ఉంది. కిలో వెండి ధర రూ.62,580గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కెప్టెన్​గా రోహిత్ శర్మను​ తప్పించొచ్చు!​'
    భారత జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మపై కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ ఓపెనర్​ వీరేంద్ర సెహ్వాగ్. టీ20 ఫార్మాట్​లో కెప్టెన్​గా రోహిత్​ శర్మను తప్పించొచ్చని అభిప్రాయపడ్డాడు. అందుకు పలు కారణాలను వివరించాడు. అవేంటంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నాంది' కాంబో రిపీట్​.. ఇంట్రెస్టింగ్​ పోస్టర్​తో అల్లరినరేశ్ కొత్త సినిమా
    నటుడు అల్లరినరేశ్​ తన 60వ సినిమాను ప్రకటించారు. 'నాంది' చిత్రంతో తనకు సూపర్​హిట్​ ఇచ్చిన దర్శకుడు విజయ్​ కనకమేడలతో మూవీ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు జాన్‌ అబ్రహం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ, తారా సుతారియా నటించిన మల్టీస్టారర్‌ బాలీవుడ్‌ చిత్రం 'ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌' టీజర్​ పోస్టర్స్​ రిలీజై సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.