ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : Jul 2, 2022, 12:56 PM IST

AP TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM

..

  • 'సరైన నాయకులను తయారు చేసుకోలేని స్థితిలో భారత్‌'
    Justice NV Ramana in America : తెలుగువారు ఎక్కడ ఉన్నా.. భాషే వారిని ఏకం చేస్తుందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు. విశ్వమానవ సౌభ్రాతృత్వానికి తెలుగువారు ప్రతీకలు కావాలని ఆకాంక్షించారు. భారత్‌లో సరైన నాయకులను తయారుచేసుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిస్వార్థం, సేవాగుణం కలిగిన నాయకులు సమాజానికి అవసరమని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "చంద్రబాబుపై పోటీనా.. నేనా..??"
    టీడీపీ అధినేత చంద్రబాబుపై కుప్పం నియోజక వర్గం‌ నుంచి హీరో విశాల్ పోటీ చేస్తారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ విషయం‌ ట్రెండింగ్​గా మారటంతో.. ఈ రూమర్స్‌పై విశాల్ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇక ఫోన్​లోనే కరెంట్​ బిల్లు తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
    Electricity Bill with Mobile Phone : మీ ఇంట్లో మీరు వినియోగించిన కరెంటు బిల్లు మీరే తీసుకుని ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. నెలలో ఎన్నిరోజులకు ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారో కూడా తెలుసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా. మీ సెల్‌ఫోన్‌తో మీ ఇంటి విద్యుత్ మీటర్ రీడింగ్‌ను ఫొటో తిస్తే ఎన్ని యూనిట్లు వినియోగించారో తెలుస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మీ పిల్లలు నిత్యం ద్వేషించుకుంటున్నారా.. జాగ్రత్త!
    కమలకు ఇద్దరు పిల్లలు పుట్టారనే సంతోషం నాలుగేళ్లకే ఆవిరైపోయింది. ఒకరి బొమ్మలు మరొకరితో పంచుకోకపోవడం, ఇద్దరూ ఎదుటివారిపై అసూయతో నిత్యం గొడవపడటం, నువ్వెందుకు వచ్చావ్‌.. అనే స్థాయికి చేరింది వారి ప్రవర్తన. దీన్ని మొగ్గలోనే తుంచాలంటున్నారు నిపుణులు. వారిమధ్య బాల్యం నుంచే ప్రేమానుబంధాల్ని పెంచాలంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గన్​తో ఆడుతూ ట్రిగ్గర్​ నొక్కిన బాలుడు.. రెండేళ్ల చిన్నారి మృతి
    తండ్రి తుపాకీతో ఆడుకుంటూ పొరపాటున రెండేళ్ల తమ్ముడిని కాల్చాడు అన్నయ్య. హిమాచల్​ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటనలో బాలుడు అక్కడిక్కడికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జవాన్లు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం.. రోడ్డుపైనే హైడ్రామా!
    ఉత్తరాఖండ్​.. హరిద్వార్​లోని దెహ్రదూన్​ జాతీయ రహదారిపై గంటకుపైగా హైఓల్టేజ్​ డ్రామా నడిచింది. ఆర్మీసిబ్బంది, పోలీసులు మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. సరకులతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు.. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు కారును ఢీకొట్టడం వల్ల వివాదం మొదలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు.. ముగ్గురు మృతి
    Shooting America: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. ఫ్లాయిడ్ కౌంటీలోని కెంటుకీ ప్రాంతంలో ఓ ఇంట్లో తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులపై దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. బిట్​కాయిన్ పతనం
    Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ధోనీకి మోకాళ్ల నొప్పులు.. రూ.40లకే ఆయుర్వేద చికిత్స
    Dhoni knee problem: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అయితే ఇతడు.. దీని పరిష్కారం కోసం ఓ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినట్లు తెలిసింది. కేవలం రూ.40లకే చికిత్స తీసుకుంటున్నాడట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను: రాశీఖన్నా
    Raasikhanna: 'ఊహలు గుసగుసలాడే'తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్​ రాశీఖన్నా.. గ్లామర్​ సహా ఈ మధ్య కాలంలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.