ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

author img

By

Published : Jun 2, 2021, 1:01 PM IST

1 PM TOP NEWS
1 PM TOP NEWS

..

  • పలమనేరులో ఏనుగుల గుంపు హల్​చల్
    చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తోంది. గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు... రోడ్డు దాటుతుండగా స్థానికులు ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పరీక్షల రద్దుపై వైకాపా సర్కార్‌ మొండి వైఖరి వీడాలి'
    కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం పంతాలకు పోకుండా.. పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈసీ బోర్డులతోపాటు దేశవ్యాప్తంగా పరీక్షలు ఆపేసినా.. రాష్ట్ర ప్రభుత్వం వాయిదాల పేరుతో విద్యార్థుల్ని ఒత్తిడికి గురి చేస్తోందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తలవెంట్రుక మొనపై బంగారు తాజ్‌మహల్‌
    తలవెంట్రుక మెునపై బంగారంతో తాజ్​మహల్​ రూపొందించి అబ్బురపరిచారు.. ఏటికొప్పాకకు చెందిన ప్రముఖ హస్తకళాకారుడు శ్రీశైలపు చెన్నయ్యచారి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాలన్న ఆశయంతో.. ఈ అద్భుత కళాకృతిని సృష్టించినట్లు ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విదేశీ టీకాల రాకకు లైన్‌క్లియర్‌..!
    దేశంలో వ్యాక్సిన్​ కొరత ఏర్పడ్డ క్రమంలో.. విదేశీ టీకాలకు(Corona Vaccine) అనుమతి ప్రక్రియల్లో డీసీజీఐ మార్పులు చేసింది. డబ్ల్యూహెచ్​ఓ ఆమోదించిన కొవిడ్​-19 టీకాలు భారత్‌లో బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రూ.15లక్షలకు చిన్నారిని అమ్మిన డాక్టర్ అరెస్టు
    చిన్నారి అపహరణ కేసులో ఓ డాక్టర్​ను అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. దాదాపు ఏడాది పాటు దర్యాప్తు చేపట్టి కేసు మిస్టరీని తెలుసుకున్నారు. చిన్నారిని రక్షించి సొంత తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉచిత డీమ్యాట్​ ఆఫర్​లో నిజమెంత?
    స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ ఖాతా(DEMAT account) ఉండాల్సిందే. వీటికి సంబంధించి చాలా ప్రకటనలు ఇంటర్నెట్​లో, టీవీల్లో చూస్తుంటాం. ఉచిత ఖాతా(Free DEMAT) మీము అందిస్తున్నాం అనేది వాటి సారంశంగా మెజార్టీ సందర్భాల్లో ఉంటుంది. అసలు డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? నిజంగా ఇవి ఉచితంగా ఉంటాయా? వాటిలో నిజం ఎంత? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • డెల్టా వేరియంట్‌పై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన!
    భారత్​లో అత్యధికంగా వ్యాప్తించిన కరోనా డెల్టా వేరియంట్​పై(Delta Variant) డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రకం వేరింయట్​లో ఒక స్ట్రెయిన్ అత్యంతప్రమాదకారి అని తెలిపింది. గత నెల బి.1.617ను 'ఆందోళనకర వేరియంట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ధోనీ టీమ్ఇండియాలోకి రావడానికి నేనూ కారణమే!'
    టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ(MS Dhoni) జాతీయ జట్టులోకి రావడానికి తానూ కృషి చేసినట్లు అంటున్నాడు మాజీ సెలెక్టర్​ కిరణ్​ మోరె(Kiran More). దులీప్​ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్​జోన్​ టీమ్​లో ధోనీని ఆడించేందుకు అప్పటి జాతీయ క్రికెటర్లు గంగూలీ, దీప్​దాస్​ గుప్తాలను ఒప్పించినట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.