ETV Bharat / business

RBI New Rules on Home Loans Save Big: ఇంటి కోసం బ్యాంకు లోన్​ తీసుకున్నారా..? లక్షల రూపాయలు ఆదా చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 3:47 PM IST

RBI New Rules on Home Loans Save Big : ఇంటికోసం మీరు బ్యాంకు లోన్ తీసుకున్నారా..? కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే.. ఇది మీకోసమే. ఆర్​బీఐ శుభవార్త చెప్పింది. కొత్త నిబంధన ప్రకారం.. లక్షలాది రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కల్పించింది..! మరి, ఆ వివరాలేంటో ఇక్కడ తెలుకోండి.

RBI New Rules on Home Loans
RBI New Rules on Home Loans Save Big

RBI New Rules on Home Loans Save Big : సొంత ఇల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. ఈ స్వప్నం నెరవేర్చుకోవడం కోసం చాలా మంది.. బ్యాంకు లోన్ తీసుకుంటారు. అయితే.. చాలా కాలంపాటు సాగే EMIల వల్ల వడ్డీ భారం పెరిగి రుణగ్రహీతలు ఆర్థికంగా దెబ్బతింటారు. ఇలాంటి వారికి ఊరటనిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అదిరే శుభవార్త చెప్పింది. కొన్ని రీపేమెంట్ నిబంధనలను రూపొందించింది. ఇంతకీ ఆ నిబంధనలు ఏంటి? దాని ద్వారా హోమ్ లోన్ కస్టమర్లకు కలిగే ప్రయోజనాలు ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

Home Loan RBI New Rules : వడ్డీ రేట్లను రీసెట్‌ చేసేటప్పుడు ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్ల(Fixed Interest Rates)కు మారే అవకాశాన్ని రుణ గ్రహీతలకు కల్పించాలని ఆర్​బీఐ సూచించింది. అదేవిధంగా.. ఈఎంఐ(EMI) లేదా కాలవ్యవధి(Tenure)లో ఏదో ఒకదాన్ని, లేదంటే.. రెండిటినీ పెంచుకునే అవకాశం సైతం రుణ గ్రహీతకు ఉండాలని ఆదేశించింది. దీంతోపాటు.. బెంచ్‌ మార్క్‌ వడ్డీ రేట్లు మారినప్పుడు ఈఎంఐ/ కాలవ్యవధి, రెండింటిపై పడే ప్రభావం గురించి.. రుణం మంజూరు చేసేటప్పుడే బ్యాంకులు/ఆర్థిక సంస్థలు స్పష్టంగా రుణగ్రహీతలకు తెలపాలని సూచించింది. అదేవిధంగా.. ఈఎంఐ/ కాల వ్యవధి పెంచాల్సిన సందర్భంలోనూ.. రుణ గ్రహీతలకు ఆ వివరాలను స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. ఇటీవల పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్​బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంది.

Home Loan Calculator : రుణ కాలవ్యవధిలో ఎన్నిసార్లు వడ్డీ రేట్లు మారేందుకు అవకాశం ఉంటుందో కూడా రుణ గ్రహీతలకు చెప్పాలని బ్యాంకులకు ఆర్​బీఐ సూచించింది. కాలవ్యవధిలో.. రుణం మొత్తాన్ని లేదా కొంతమొత్తాన్ని చెల్లించేందుకూ అవకాశం కల్పించాలని సూచించింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం హోమ్‌ లోన్‌(Home Loans) కస్టమర్లకు చాలా సహాయ పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

SBI Home Loan Offers : హోమ్​ లోన్ కావాలా? వడ్డీ రేట్లపై SBI భారీ డిస్కౌంట్స్.. ఎవరికి అంటే..

ఆర్​బీఐ కొత్త నిబంధన రుణగ్రహీతకు ఎలా సహాయపడుతుందో ఉదాహారణతో చూద్దాం..

మీరు 2020లో.. 20 సంవత్సరాలకు (240 నెలలు) 7% వడ్డీతో రూ. 50 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నారని అనుకుందాం. లోన్ తీసుకునే సమయంలో మీ నెలవారీ EMI రూ. 38,765. మొత్తం వడ్డీ రూ.43.04 లక్షలు. మూడేళ్ల తర్వాత వడ్డీ రేటు 9.25%కి పెరిగిందనుకుందాం. RBI కొత్త ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు మీ EMI లేదా కాల వ్యవధిని పెంచుకోవడానికి లేదా వడ్డీ రేటును రీసెట్ చేసేటప్పుడు రెండింటినీ పెంచుకుని ఉపయోగించుకునే అవకాశాన్ని మీకు ఇచ్చింది.

ఇప్పుడు ఒకవేళ మీరు మీ 20 సంవత్సరాల లోన్‌ను మిగిలిన 17 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయాలనుకుంటే (3 సంవత్సరాలు గడిచాయి కదా).. పెరిగిన వడ్డీ రేటు ప్రకారం.. మీ EMI నెలకు రూ. 44,978కి చేరుతుంది. మీరు లోన్ కాలం ముగిసే సమయానికి మొత్తం రూ. 55.7 లక్షల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

అదే.. మీరు మీ లోన్ కాలపరిమితిని పెంచుకోవడాన్ని ఎంచుకుంటే.. మీ EMIని యథావిధిగా 38,765 రూపాయలుగానే చెల్లించవచ్చు. కానీ.. కాల వ్యవధి 321 నెలలు లేదా 26 సంవత్సరాల 10 నెలలకు చేరుతుంది. దీనివల్ల.. మీ లోన్ గడువు ముగిసే సమయానికి మీరు చెల్లించాల్సిన మొత్తం రుణం రూ.88.52 లక్షలకు చేరుతుంది. అంటే.. అధిక EMIకి బదులుగా.. అధిక కాలపరిమితిని ఎంచుకున్నందుకు.. మీరు రూ.33 లక్షల వడ్డీని అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే..?

వడ్డీ రేటు పెరిగిన తర్వాత మీరు EMI ని రూ. 38,765 నుంచి రూ.44,978కి పెంచుకొని.. 20 ఏళ్లలోనే లోన్ తిరిగి చెల్లిస్తే అప్పుడు మీరు చెల్లించాల్సిన రుణం రూ.55.7 లక్షలే అవుతుంది. కానీ.. లోన్ కాలవ్యవధి పెంచుకుంటే మాత్రం.. ఆ మొత్తం రూ. 88.52 లక్షలకు చేరుతుంది. చూశారా..? EMI పెరగడానికీ.. లోన్ కాల పరిమితి పెంచుకోవడానికి ఎంత తేడా ఉందో! ఆర్​బీఐ కొత్త రూల్స్ ప్రకారం.. ఈ రెండిట్లో ఏది పెంచుకోవాలి? అన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. అవకాశం ఉన్నవారంతా.. లోన్ కాల వ్యవధిని కాకుండా, EMI పెంచుకోవడం ద్వారా.. భారీగా వడ్డీ డబ్బును ఆదా చేసుకోవచ్చన్నమాట.

Home Loans at Lowest Interest Rates : అతి తక్కువ వడ్డీతో.. హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

Home Loan Step Up EMI : సొంత ఇల్లు క‌ట్టుకోవాలా?.. స్టెప్​​-అప్​ ఈఎంఐ బెస్ట్ ఆప్షన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.