ETV Bharat / business

డిసెంబర్​ 1 నుంచి న్యూ సిమ్​ కార్డ్ రూల్స్ - ఉల్లంఘిస్తే రూ.10 లక్షలు పెనాల్టీ/ జైలు శిక్ష!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 6:16 PM IST

New SIM Card Rules From 1st December 2023 In Telugu : సిమ్ కార్డ్​ వినియోగదారులకు, డీలర్స్​కు అలర్ట్​. డిసెంబర్​ నుంచి కొత్త సిమ్ కార్డ్​ రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

New SIM Card Rules and Fines
New SIM Card Rules From 1st December 2023

New SIM Card Rules From 1st December 2023 : నేడు మొబైల్ ఫోన్ లేనిదే జీవించలేని పరిస్థితి ఏర్పడింది. చాలా మంది కనీసం ఒకటి లేదా అంతకు మించి సిమ్​ కార్డులను వాడుతూ ఉంటారు. అందుకే మొబైల్ ఫోన్ యూజర్లు అందరూ 2023 డిసెంబర్​ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త సిమ్ కార్డ్​ రూల్స్ గురించి తెలుసుకోవాలి.

కొత్త నిబంధనలు పాటించాల్సిందే!
కేంద్ర ప్రభుత్వం మొదట్లో ఈ అక్టోబర్​ 1 నుంచే ఈ కొత్త సిమ్​ కార్డ్​ నిబంధనలను అమలు చేయాలనుకుంది. కానీ తరువాత డిసెంబర్​ 1 వరకు ఆ గడువును పొడిగించింది. మీరు కనుక కొత్త సిమ్​ కార్డ్​ కొనుగోలు చేయాలనుకున్నా, లేదా సిమ్​ కార్డ్ విక్రేతలుగా ఉండాలన్నా.. డిసెంబర్​ 1 నుంచి అమల్లోకి రానున్న సిమ్​ కార్డ్​ రూల్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

స్కామ్స్ నివారించేందుకే..
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఫేక్​ సిమ్​లతో జరిపే.. ఆన్​లైన్ స్కామ్​లు, ఫ్రాడ్​లు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని నివారించేందుకే డిపార్ట్​మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ సరికొత్త సిమ్​ కార్డ్ రూల్స్​ను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అందువల్ల ఇకపై కొత్త సిమ్​ కార్డ్​ కొనాలన్నా, లేదా సిమ్​ కార్డ్​ విక్రేతలుగా ఉండాలన్నా.. నూతన నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే!

ఒక వేళ ఎవరైనా ఈ సిమ్​ కార్డ్ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. వారికి ఫైన్​, పెనాల్టీ సహా జైలు శిక్ష కూడా విధిస్తారు. కనుక, మనం డిసెంబర్ 1​ నుంచి అమలుకానున్న నయా సిమ్ కార్డ్ రూల్స్ గురించి తెలుసుకుందాం.

New Sim Card Rules 2023

1. సిమ్ డీలర్ వెరిఫికేషన్​ : ఎవరైనా సిమ్​ కార్డులు విక్రయించాలని అనుకున్నా లేదా సిమ్ కార్డ్ డీలర్లుగా ఉండాలన్నా.. వారు కచ్చితంగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. అలాగే తాము విక్రయించిన సిమ్​ కార్డుల వివరాలను కచ్చితంగా నమోదు చేస్తుండాలి. అంతేకాదు పోలీస్​ ధ్రువీకరణ బాధ్యత కూడా టెలికాం ఆపరేటర్​లే తీసుకోవాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.

2. డెమోగ్రాఫిక్ డేటా ఇవ్వాలి : ఎవరైనా వ్యక్తులు తమ ప్రస్తుత ఫోన్​ నంబర్​ల కోసం సిమ్​ కార్డులను కొనుగోలు చేస్తే.. వారు కచ్చితంగా తమ ఆధార్, డెమోగ్రాఫిక్ డేటాను సమర్పించాలి.

3. సిమ్ కార్డుల జారీపై పరిమితి : కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై సిమ్​ కార్డులను ఒక పరిమిత సంఖ్యలో మాత్రమే జారీ చేస్తారు. కనుక, సాధారణ వినియోగదారులు తమ ఐడీతో గరిష్ఠంగా 9 సిమ్​ కార్డులను మాత్రమే పొందడానికి వీలవుతుంది. వ్యాపారం చేసే వ్యక్తులు మాత్రం తమ బిజినెస్​ అవసరాల కోసం పెద్ద సంఖ్యలో సిమ్​ కార్డులు తీసుకోవడానికి వీలు ఉంటుంది.

4. సిమ్ కార్డ్ డియాక్టివేషన్​ రూల్స్ : ఇకపై ఎవరైనా తమ సిమ్​ కార్డ్​ను డియాక్టివేట్ చేస్తే.. సదరు సిమ్​ కార్డ్​ నంబర్​ను 90 రోజుల వ్యవధి తరువాత మాత్రమే మరొక వ్యక్తికి అలాట్ చేయడం జరుగుతుంది.

5. పెనాల్టీ : సిమ్​ కార్డ్ విక్రయదారులు నవంబర్ 30లోగా రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు జైలు శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి.

LIC నయా పాలసీ - జీవితాంతం ఆదాయం గ్యారెంటీ!

రెనో​ న్యూ-జెన్​ Duster​ కార్​ ఆవిష్కరణ - లుక్స్​, ఫీచర్స్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.