ETV Bharat / business

ఏప్రిల్​ నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్​ ఇదే..

author img

By

Published : Mar 29, 2023, 11:48 AM IST

April Bank holidays 2023 India : కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే.. ఏప్రిల్​ నెలలో మీరు బ్యాంక్​కు వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే! దేశవ్యాప్తంగా వివిధ పండుగలు, సాధారణ సెలవులతో కలిపి ఏప్రిల్​లో సగం రోజులు పాటు బ్యాంకులు పనిచేయవు. వచ్చే నెలలో మొత్తంగా 15 రోజులు(అన్ని రాష్ట్రాల్లో కలిపి) బ్యాంకులు మూతపడతాయి.

list of bank holidays in april 2023
ఏప్రిల్ నెల బ్యాంక్​ సెలవులు

April Bank holidays 2023 India : ప్రతి నెల ప్రారంభానికి ముందు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా బ్యాంక్ హాలిడేస్​ను ప్రకటిస్తుంది. దీనిలో భాగంగానే ఏప్రిల్​ నెల సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ లెక్కన శని, ఆదివారాలతో కలుపుకొని మొత్తం 15 రోజుల పాటు(అన్ని రాష్ట్రాల్లో కలిపి) దేశంలో ఉన్న వివిధ బ్యాంకులు మూతపడనున్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఏప్రిల్‌ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఖాతాల సర్దుబాటు దృష్ట్యా బ్యాంకులు సాధారణ కార్యకలాపాలు నిర్వహించవు. దీనికి తోడు వచ్చే నెలలో మహావీర్‌ జయంతి, బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి, గుడ్‌ఫ్రైడేతో పాటుగా.. రంజాన్​ వంటి ప్రత్యేక రోజులు ఉన్నాయి. కావున ఆ రోజుల్లో బ్యాంక్​లు మూసివేయనున్నారు.

April Bank holidays India : ఏప్రిల్ నెలలో బ్యాంకును సందర్శించే ఖాతాదారులు ఈ సెలవుల జాబితాను ఒకసారి చెక్​ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి రావచ్చు. అప్పుడు ఆన్​లైన్​ బ్యాంకింగ్​ వ్యవస్థ మాత్రమే పనిచేస్తుంది. అయితే ఆర్​బీఐ సెలవుల జాబితాలోని బ్యాంకు సెలవులు.. అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాలకు, ప్రాంతాలకు ఉన్న వేడుకలు, పండుగల ఆధారంగా సెలవులు ఇస్తారు. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు శని, ఆదివారాలు, జాతీయ సెలవు దినాలు మాత్రం ఒకేలా ఉంటాయి. మరి ఆ జాబితాకు తగ్గట్టుగా.. మనం కూడా బ్యాంక్​ పనులను ప్లాన్​ చేసుకుందామా! ప్రాంతాల వారీగా బ్యాంకు​ సెలవుల వివరాలు మీకోసం..

  • ఏప్రిల్ 1: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కారణంగా.. బ్యాంకుల్లో సాధారణ కార్యకలాపాలు నిర్వహించరు.
  • ఏప్రిల్ 2: ఆదివారం.. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • ఏప్రిల్ 4: మహావీర్​ జయంతి.. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • ఏప్రిల్ 5: బాబూ జగజ్జీవన రామ్ జయంతి.. దేశంలోని బ్యాంకులు అన్నీ బంద్.
  • ఏప్రిల్ 7: గుడ్ ఫ్రైడే.. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • ఏప్రిల్ 8: రెండో శనివారం.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్ 9: ఆదివారం.. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • ఏప్రిల్ 14: అంబేడ్కర్ జయంతి.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
  • ఏప్రిల్ 15: బంగాల్​లో కొత్త సంవత్సరం ప్రారంభం (అగర్తలా, గువాహటి, కోల్‌కతాలోని అన్ని బ్యాంకులకు సెలవు)
  • ఏప్రిల్ 16: ఆదివారం.. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • ఏప్రిల్ 18: షాబ్-ఎ-క్వార్డ్ (జమ్ముకశ్మీర్‌లోని బ్యాంక్​లకు మాత్రమే సెలవు.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని బ్యాంక్స్​ యథావిధిగా పనిచేస్తాయి)
  • ఏప్రిల్ 21: ఈద్-ఉల్-ఫితర్
  • ఏప్రిల్ 22: నాలుగో శనివారం.. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • ఏప్రిల్ 23: ఆదివారం.. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • ఏప్రిల్ 30: ఆదివారం.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
  • ఇవీ చదవండి:
  • మరో 3 రోజులే గడువు.. ఈ పనులన్నీ పూర్తి చేస్తే మీకే మేలు!
  • పాన్-ఆధార్ లింక్​ గడువు పొడిగింపు.. ఎప్పటివరకు అంటే..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.