ETV Bharat / business

ఘనంగా ముకేశ్​ అంబానీ మనమడి బర్త్​డే పార్టీ.. హాజరైన పలువురు ప్రముఖులు

author img

By

Published : Jan 2, 2023, 9:25 PM IST

ముంబయిలోని జియో వరల్డ్​ గార్డెన్​లో ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ మనమడు బర్త్​డే పార్టీ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

akash ambani son birthday celebration
పృథ్వీ అంబానీ పుట్టినరోజు వేడుకలు

రిలయన్స్​ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ మనమడు పృథ్వీ అంబానీ బర్త్​డే పార్టీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా దంపతుల కుమారుడు పృథ్వీ.. బర్త్​డే పార్టీకి ముంబయిలోని జియో వర్డల్ గార్డెన్ వేదికైంది. వాస్తవానికి డిసెంబరు 10న పృథ్వీ అంబానీ పుట్టినరోజు కాగా.. సోమవారం ఘనంగా అతిథులకు పార్టీ ఇచ్చింది అంబానీ ఫ్యామిలీ. ఈ వేడుకలకు ముకేశ్ కుటుంబసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

akash ambani son birthday celebration
పృథ్వీ పుట్టినరోజు వేడుకల్లో ఆకాశ్​ అంబానీ దంపతులు

ముకేశ్​ అంబానీ కుమారుడు ఆకాశ్​కు.. శ్లోకా మెహతాతో 2019 మార్చి 9న వివాహమైంది. వీరికి 2020 డిసెంబర్​ 10న పృథ్వీ పుట్టాడు. అయితే ఏడాదిన్నర వయసుకే పృథ్వీని ప్లేస్కూల్​లో చేర్పించారు ఆకాశ్​- శ్లోక దంపతులు. ముంబయి మలబర్ హిల్​లోని సన్​ఫ్లవర్​ నర్సరీ స్కూల్​లో చేర్చారు. ఆకాశ్​, శ్లోక కూడా అదే స్కూల్​లో తమ విద్యాభ్యాసం ప్రారంభించడం విశేషం.

akash ambani son birthday celebration
కుమారుడు పృథ్వీతో ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులు
అయితే.. అంబానీ వారసుడు కాబట్టి పృథ్వీకి ఎక్కడకు వెళ్లినా గట్టి బందోబస్తు ఉండాల్సిందే. అందుకే అతడి కోసం పాఠశాలలోనూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయించారు. కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలానే.. 24 గంటలూ పృథ్వీ వెన్నంటే ఓ వైద్యుడు ఉండేలా చూస్తున్నారు. అంబానీ మనవడు అయినప్పటికీ.. పృథ్వీని అందరు విద్యార్థులతో సమానంగా చూస్తున్నట్లు చెప్పింది సన్​ఫ్లవర్​ నర్సరీ స్కూల్ యాజమాన్యం. అంబానీ వారసుడి 'స్కూల్ కహానీ' కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.