ETV Bharat / briefs

CM Jagan Promise Not Fulfilled: సీఎం హామీ ఇచ్చి రెండేళ్లైంది.. ఇకనైనా ఆదుకోండి

author img

By

Published : Dec 28, 2021, 1:29 PM IST

CM jagan promise to handicapped: అసలే నిరుపేద కుటుంబం..! కష్టపడి చదువు పూర్తి చేసినా...ప్రమాదంలో కాలు కోల్పోయాడు..! ఉద్యోగం ఇప్పించాలంటూ రెండేళ్ల కిందట ముఖ్యమంత్రిని కలిసి విన్నవించాడు..! కొలువు కల్పించాలంటూ 2019లో అధికారుల్ని సాక్షాత్తూ సీఎం ఆదేశించినా..ఆ దివ్యాంగుడి సమస్య పరిష్కారం కాలేదు.

CM jagan promise to handicapped not to be fulfilled
దివ్యాంగుడు గణేశ్

రెండేళ్లైనా నెరవేరని సీఎం హామీ... ఇకనైనా ఆదుకోవాలని బాధితుడి విజ్ఞప్తి

ఈయన అన్ని అర్హతలూ ఉన్నా.. ఉద్యోగం దక్కని ఓ సగటు నిరుద్యోగి ! పైగా దివ్యాంగుడు..! తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన గణేశ్..2013లో డిప్లొమా ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశాడు. ఫలితాలొచ్చిన ఆనందంలోఇంటికెళ్తుండగా లారీ ప్రమాదంలో గాయపడ్డాడు. వైద్యులు మోకాలు వరకూ తొలగించారు. 2019లో వార్డు వాలంటీరుగా ఎంపికైనా.. శరీరం సహకరించకపోవడంతో మధ్యలోనే విధుల నుంచి తప్పుకున్నాడు.

రెండేళ్లయినా నెరవేరని సీఎం హామీ

తర్వాత ల్యాబ్ టెక్నీషియన్‌గా అవకాశం కల్పించాలంటూ గణేశ్ ఎన్నోసార్లు అధికారుల్ని వేడుకున్నాడు. 2019 అక్టోబరులో కరపలో బహిరంగసభకు వచ్చిన సీఎం జగన్‌కూ మొర పెట్టుకున్నాడు. స్పందించిన సీఎం.. ఉద్యోగం ఇవ్వాలంటూ అప్పటి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డిని ఆదేశించారు. గతేడాది కొవిడ్ సమయంలో కాకినాడ జీజీహెచ్​లో సేవల్ని వినియోగించుకున్నా.. తర్వాత విధుల నుంచి తొలగించారు. సీఎం హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ అమలు కాలేదని వాపోయాడు గణేశ్.

నేను 2013లో డిప్లొమా ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేశాను. లారీ ప్రమాదంలో కాలు తొలగించారు. అయితే 2019లో వార్డు వాలంటీరుగా ఎంపికయ్యాను. శరీరం సహకరించక మధ్యలోనే తప్పుకున్నాను. 2019 సీఎం జగన్‌ను కలిసి ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశా. ఉద్యోగం ఇవ్వాలంటూ అప్పటి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. అయితే సీఎం హామీ ఇచ్చి రెండేళ్లయినా ఇప్పటికీ అమలు కాలేదు. - గణేశ్​, బాధితుడు

గణేశ్ తల్లి సత్యవతి తాటాకు బుట్టలు అల్లుకుంటూనే కుమారుణ్ని పోషిస్తోంది. ఈ పనిలో తల్లికి సాయం చేస్తున్నాడు. అతడి పరిస్థితి గమనించైనా ఉద్యోగం కల్పించాలని కుటుంబసభ్యులు, స్నేహితులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి..

CM Jagan On Welfare Schemes: ప్రభుత్వ రాబడి తగ్గినా..సంక్షేమ పథకాలు ఆపలేదు: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.