ETV Bharat / bharat

అమ్మకు గోల్డ్​.. కూతురికి బ్రాంజ్​.. పనిమనిషి కుటుంబానికి పతకాల పంట

author img

By

Published : Sep 26, 2022, 4:26 PM IST

అనుకున్నది సాధించాలనే తపన ఆ మహిళలో ఉంది. అందుకే కొంతమంది ఇళ్లల్లో పనిచేస్తూ.. రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలో బంగారు పతకం సాధించింది. వెయిట్​ లిఫ్టింగ్​పై ఆసక్తి ఉన్న తన కుమార్తెను కూడా ప్రోత్సహించడం వల్ల.. ఆమె కూడా కాంస్య పతకంతో మెరిసింది. ఇలాంటి అరుదైన ఘనతలను సాధించిన ఆ తల్లీకూతుర్ల విజయగాథను ఓ సారి తెలుసుకుందాం.

weightlifting competition
బంగారం, కాంస్య పతకంగా విజేతలు

తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన తల్లీకూతుర్లు అరుదైన ఘనత సాధించారు. తిరుచ్చిలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ ​లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల విభాగంలో తల్లి మసిలమణి బంగారు పతకం సాధించగా.. 47 కిలోల విభాగంలో ఆమె కుమార్తె ధరణి కాంస్య పతకంతో మెరిసింది.

weightlifting competition
బంగారం, కాంస్య పతకం సాధించిన తల్లీకూతుర్లు
కోయంబత్తూరుకు చెందిన రమేశ్ వృత్తి రీత్యా.. పెళ్లి మండపాలు డిజైన్ చేస్తుంటాడు. అలాగే కూలీ పనులకు వెళ్తుంటాడు. ఆయన భార్య మసిలమణి పలువురి ఇళ్లల్లో పనులు చేస్తోంది. అయితే ఆమె కాస్త లావుగా ఉండేది. దీంతో ఓ రోజు ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని వ్యాయామం చేయమని సలహా ఇచ్చింది. వెంటనే మసిలమణి జిమ్​లో చేరింది.
weightlifting competition
బంగారం, కాంస్య పతక విజేతలు

జిమ్​లో కొందరు వెయిట్ ​లిఫ్టింగ్ చేయడం చూసి.. మసిలమణికి వెయిట్​ లిఫ్టింగ్​పై ఆసక్తి కలిగింది. ఈ విషయం జిమ్ ట్రైనర్ శివకుమార్ గమనించాడు. దీంతో ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఆయన ముందుకొచ్చాడు. మసిలమణి జిమ్​ చేయడం చూసి.. ఆమె కుమార్తె ధరణికి వెయిట్​ లిఫ్టింగ్​ పట్ల ఇంట్రెస్ట్​ వచ్చింది. కుమార్తె ఆసక్తిని గమనించిన మసిలమణి.. ఆమెను ప్రోత్సహించింది. ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా తనతోపాటు వెయిట్​ లిఫ్టింగ్ శిక్షణకు తీసుకెళ్లింది. జిమ్​ ట్రైనర్ శివకుమార్​.. ధరణికి కూడా ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించాడు.

weightlifting competition
ధరణి

అలా మసిలమణి, ధరణిలు బాగా శిక్షణ తీసుకుని.. తిరుచ్చిలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. కొద్దిరోజుల క్రితమే ధరణి.. చెన్నైలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకంతో మెరిసింది.

weightlifting competition
బంగారం, కాంస్య పతకం సాధించిన తల్లీకూతుర్లు

ఇలా తల్లీకూతుర్లు, తల్లీకొడుకులు కలిసి ఘనతలు సాధించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కేరళకు చెందిన తల్లీకొడుకులు.. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాల్ని సాధించారు. త్రిపురలోని అగర్తలాకు చెందిన షీలా రాణి దాస్ 53 ఏళ్ల వయసులో ఇద్దరు కుమార్తెలతో కలిసి బోర్డు పరీక్షలు రాసి పాసయ్యారు. విద్యకు వయసు అడ్డంకి కాదని ఆమె నిరూపించారు. వీరి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి: మైసూర్ ప్యాలెస్​లో నవరాత్రి ఉత్సవాలు.. ఎక్స్​క్లూజివ్​ ఫొటోస్

భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్​రేప్.. ప్రైవేట్ భాగాల్లోకి కత్తి.. దళితుడు కుర్చీలో కూర్చున్నాడని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.