ETV Bharat / bharat

'నాకు ఎన్​కౌంటర్​ అంటే భయం​.. జైలుకు పంపండి సారూ'.. పోలీసుల ఎదుట లొంగిపోయిన దొంగ!

author img

By

Published : Apr 1, 2023, 11:11 AM IST

Updated : Apr 1, 2023, 11:18 AM IST

ఎన్​కౌంటర్ చేస్తారేమోనన్న భయంతో ఓ దొంగ పోలీస్​ స్టేషన్​లో లొంగిపోయాడు. తనను జైలుకు పంపాలని.. భవిష్యత్​లో ఎలాంటి నేరాలకు పాల్పడనని పోలీసులకు చెప్పాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Robbery accused surrenderd fearing an encounter
Robbery accused surrenderd fearing an encounter

ఉత్తర్​ప్రదేశ్​లో అరుదైన ఘటన జరిగింది. పోలీసులు ఎన్​కౌంటర్​ చేస్తారనే భయంతో ఓ వ్యక్తి పోలీస్​ స్టేషన్​కు చేరుకుని లొంగిపోయాడు. అనంతరం తనను జైలుకు పంపాలని వేడుకున్నాడు. దాంతో పాటు దొంగతనం చేసిన డబ్బుల్ని కూడా పోలీసులకు ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన సుహాన్​పుర్ జిల్లా ఫతేపుర్​ పోలీస్​స్టేషన్​లో జరిగింది.

అసలు ఏం జరిగిందంటే?
అభినవ్​ అనే వ్యక్తి ముజఫర్​పుర్​ జిల్లా బుధానా పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులతో కలసి ఫతేపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ ఫైనాన్స్​ కంపెనీ వ్యక్తి నుంచి రూ. 2.75 లక్షలు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మార్చి 16న రాహుల్​, సచిన్​ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ప్రధాన సూత్రధారి అభినవ్​ తప్పించుకుని తిరిగాడు. అతడి కోసం పోలీసులు అనుమానం ఉన్న ప్రతి ప్రాంతాన్ని గాలించారు. కానీ అతడి గురించి ఎలాంటి జాడ తెలియలేదు. అభినవ్​ను పట్టుకుని అప్పగిస్తే రూ. 25 వేలు బహుమతి ఇస్తామని పోలీసులు రివార్డు ప్రకటించారు.

Robbery accused surrenderd fearing an encounter
పోలీసులకు లొంగిపోయిన వ్యక్తి
Robbery accused surrenderd fearing an encounter
ప్లకార్టుతో పోలీస్​ స్టేషన్​కు వచ్చిన అభినవ్​

తన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని, రివార్డు కూడా ప్రకటించారనే విషయం తెలుసుకున్నాడు అభినవ్​. దీంతో తాను కనపడితే పోలీసులు ఎన్​కౌంటర్​ చేస్తారేమో భయపడిపోయాడు. వెంటనే తనకు తానుగా ఫతేపుర్​ పోలీస్​ స్టేషన్​కు వచ్చాడు. 'సర్​ నన్ను అరెస్టు చేయండి. జైలుకు పంపండి. ఎన్​కౌంటర్​ అంటే నాకు చాలా భయం. ఇలాంటి నేరాలు భవిష్యత్​లో మళ్లీ ఎప్పుడూ చేయను' అని రాసి ఉన్న ప్లకార్డును కూడా తెచ్చుకుని పోలీసుల మందు ప్రదర్శించాడు. తన నేరాన్ని అంగీకరించి.. తాను దొంగిలించిన డబ్బుల్లో రూ.40 వేలు పోలీసులకు ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

'నాకు ఎన్​కౌంటర్​ అంటే భయం​.. జైలుకు పంపండి సారూ'

అయితే విచారణ సందర్భంగా నిందితుడు పలు విషయాలు వెల్లడించాడు. తన పేరు, చిరునామాతో పాటు.. తాను డిగ్రీ చదువుకున్నానని, కలెక్షన్​ ఏజెంట్​గా పనిచేసేవాడినని చెప్పాడు. ఆ సమయంలోనే ఇల్లు కట్టుకునేందుకు సచిన్​ లోన్​ తీసుకున్నాడని.. అలా తమ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపాడు. సచిన్​కు డబ్బు సరిపోక.. లోన్​ ఇన్​స్టాల్​మెంట్​ చెల్లించలేదని చెప్పాడు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని.. తన ఫ్రెండ్​ రాహుల్​తో కలిసి దొంగతనం చేసేందుకు ప్లాన్​ వేశామని చెప్పుకొచ్చాడు.

Last Updated : Apr 1, 2023, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.