ETV Bharat / bharat

టెన్త్ క్లాస్ విద్యార్థినిపై కారులో గ్యాంగ్​ రేప్​

author img

By

Published : Jul 15, 2022, 6:31 PM IST

పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్​ చేసి.. ఆపై కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, లవర్​తో మాట్లాడుతున్నందుకు కుమార్తెను గొంతు కోసి చంపేశాడు ఆమె తండ్రి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

tenth class girl gangraped in delhi and father killed daughter for she talks with lover
tenth class girl gangraped in delhi and father killed daughter for she talks with lover

Tenth Class Girl Gang Raped: దిల్లీలో దారుణం జరిగింది. పదో తరగతి విద్యార్థినిని అపహరించి.. ఆ తర్వాత కారులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఇద్దరు నిందితులతో సహా ఆమె బాయ్​ఫ్రెండ్​ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. జులై 6న వసంత్​ విహార్​లోని మార్కెట్​లో పదో తరగతి విద్యార్థినిని ఇద్దరు యువకులు కిడ్నాప్​ చేశారు. ఆపై మహిపాల్​పుర్​ ప్రాంతంలో కారు పార్క్​ చేసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కుటుంబసభ్యులు ఆరా తీయగా.. జరిగినదంతా చెప్పింది.

జులై 8న బాధితురాలు తన తండ్రితో ఆసుపత్రికి వెళ్లింది. వెంటనే హాస్పిటల్​ యాజమాన్యం పోలీసులకు సమచారం అందించింది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు.. బాలికను విచారించారు. బాధితురాలి ఫిర్యాదు అందుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులతో పాటు బాధితురాలి బాయ్​ఫ్రెండ్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే తన బాయ్​ఫ్రెండ్​ ఎలాంటి తప్పు చేయలేదని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

లవర్​తో మాట్లాడినందుకు కూతుర్ని చంపిన తండ్రి.. ఉత్తర్​ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​లో ఓ తండ్రి.. కన్న కూతుర్ని గొంతు కోసి హత్య చేశాడు. లవర్​తో వద్దన్నా మాట్లాడినందుకే ఇలా చేశాననని పోలీసులకు చెప్పాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఫిరోజాబాద్​కు చెందిన మనోజ్​ రాఠోడ్​ కుమార్తె రుచి.. గత కొద్దిరోజులుగా ఓ యువకుడ్ని ప్రేమిస్తోంది. ఆ విషయం తెలిసిన మనోజ్​.. ఆ యువకుడితో మాట్లాడొద్దని చెప్పాడు. కానీ అది పట్టించుకోని బాధితురాలు మళ్లీ అతడితో మాట్లాడింది. దీంతో కోపం పెంచుకున్న మనోజ్​.. కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు.. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కళ్లు పొడిచి, నాలుక కోసి బాలుడి హత్య.. బిహార్​లోని బెగూసరాయ్ జిల్లా​లో ఆరేళ్ల చిన్నారిని అతి దారుణంగా హత్య చేశారు దుండగులు. చిన్నారి రెండు కళ్లను పొడిచి, నాలుకను కత్తిరించారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పెద్ద గోతిలో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ జరిగింది.. జిల్లాలోని కుస్మ్​హౌత్​ గ్రామానికి చెందిన దామోదర్​ నాలుగో కుమారుడైన అంకుశ్​ కుమార్​ గురువారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకెళ్లి తిరిగి రాలేదు. పిల్లాడి కోసం పలుచోట్ల కుటుంబసభ్యులు వెతికినా.. ఆచూకీ లభించలేదు. చివరకు గ్రామంలో ఉన్న పెద్ద గోతిలో చిన్నారి మృతదేహం ఉన్నట్లు తెలిసి అక్కడికి వెళ్లారు. గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 'మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఇంత దారుణంగా చంపేశారు. అసలు మా పిల్లవాడు చేసిన తప్పేంటి?' అంటూ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

కన్న కూతురిపై హత్యాచారం.. మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కన్న కూతురిపై ఓ తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వస్త్రం ఉపయోగించి ఆమె గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పలు సెక్షన్ల కింద నిందితుడ్ని అరెస్ట్​ చేశారు.

ఇవీ చదవండి: నిర్మాణంలో ఉన్న గోదాము కూలి ఐదుగురు మృతి

భార్యను హత్య చేసిన భర్త.. తల పట్టుకుని 12 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్​కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.